Site icon HashtagU Telugu

Owaisi: బార్డర్ కి వెళ్తానని ప్రకటించిన అసదుద్దీన్ ఓవైసీ

భారత్ చైనా సరిహద్దు అంశంపై రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ చేయాలని హైదరాబాద్ ఎంపీ, ఏంఐఏం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో చైనా ఆర్మీ ఉందా లేదా అనే విషయాన్ని ప్రధాని స్పష్టం చేయాలని అసద్ అన్నారు.
సరిహద్దు ప్రాంత పరిశీలనకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని అప్పుడే నిజానిజాలు తెలుస్తాయని ఓవైసీ పేర్కొన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలోకి చైనా వచ్చి నిర్మాణాలు చేపట్టడమే కాకుండా నగరాలను నిర్మిస్తోందని, ఇదే విషయాన్ని అమెరికా కూడా నిర్ధారించిందని కానీ మోదీ మాత్రం సైలెంట్ ఉంటున్నారని ఓవైసీ విమర్శించారు.

ఈ అంశం పార్లమెంట్లో చర్చించమని పట్టుబడితే నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా చర్చించలేమనేది ప్రభుత్వ నిర్ణయం అయితే, పార్లమెంట్ చట్టంలోని 248 లోక్ సభ రూల్ ప్రకారం అన్ని పార్టీలతో ఇంటర్నల్ డిస్కషన్ చేయండని ఓవైసీ డిమాండ్ చేశారు.

Also Read:  సీఆర్పీఎఫ్ లో పెరుగుతున్న ఆత్మహత్యలు.. రీజన్స్ ఏంటంటే?

అన్ని పార్టీల ప్రతినిధులను కశ్మీర్ కు తీసుకెళ్లిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు బార్డర్ కి తీసుకెళ్లడానికి ఎందుకు భయపడుతోందని అసద్ విమర్శించారు. బార్డర్ పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇన్షియెట్ తీసుకుంటే వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నానని,
భారత సార్వభౌమత్వాన్ని కాపాడడంలో భాగస్వాములు అవుతామని ఓవైసీ ప్రకటించారు.

Also Read: ఆ గ్రామాల్లో జనం వలస బాట

Exit mobile version