700 Myanmar Nationals Entry : హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ నుంచి ప్రజలు మిజోరాం, అస్సాం రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు..
అయితే ఆశ్చర్యకరంగా మయన్మార్ దేశం నుంచి మణిపూర్ రాష్ట్రానికి వందలాదిగా జనం వలస వస్తున్నారు.
కేవలం రెండు రోజుల్లో అంటే జూలై 22, 23 తేదీల్లో 718 మంది మయన్మార్ దేశం నుంచి మణిపూర్ కు వలస వచ్చారు.
మణిపూర్ కు మయన్మార్ జాతీయుల వలసపై కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా అలర్ట్ అయింది. కేవలం 2 రోజుల వ్యవధిలో 718 మంది మయన్మార్ జాతీయులను మణిపూర్ లోకి ఎలా అనుమతించారనే దానిపై అస్సాం రైఫిల్స్ నుంచి కేంద్ర హోం శాఖ సమగ్ర నివేదిక కోరింది. మయన్మార్ లోని ఖంపత్ వద్ద ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతం నుంచి ప్రజలు బార్డర్ లోని మణిపూర్ కు వలస వస్తున్నారు. జూలై 22, 23 తేదీల్లో 718 మంది మయన్మార్ శరణార్థులు ఇండో-మయన్మార్ సరిహద్దును దాటి చందేల్ జిల్లా మీదుగా మణిపూర్ రాష్ట్రంలోకి ప్రవేశించారని పేర్కొంటూ “హెడ్‌క్వార్టర్ 28 సెక్టార్ అస్సాం రైఫిల్స్” ఒక నివేదికను (700 Myanmar Nationals Entry) మణిపూర్ రాష్ట్ర హోం శాఖకు అందించింది.
Also read : AP And Telangana Debts : తెలంగాణ అప్పు 3.66 లక్షల కోట్లు.. ఏపీ అప్పు 4.42 లక్షల కోట్లు
మయన్మార్ జాతీయులు స్థానికంగా ఎటువంటి ఉద్రిక్తతలు సృష్టిస్తారో అనే ఆందోళనను మణిపూర్ ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. వీసా లేకుండా మయన్మార్ పౌరులు మణిపూర్‌లోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అస్సాం రైఫిల్స్‌కు స్పష్టంగా తెలియజేసినట్లు మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వినీత్ జోషి వెల్లడించారు. మయన్మార్ జాతీయుల బయోమెట్రిక్‌లు, ఫోటోగ్రాఫ్‌లను తీసుకోవాలని చందేల్ జిల్లా పోలీసు విభాగాన్ని ఆదేశించామన్నారు. ఈవిషయాన్ని కేంద్ర సర్కారు దృష్టికి మణిపూర్ ప్రభుత్వం తీసుకెళ్లడంతో అస్సాం రైఫిల్స్ నుంచి నివేదికను కోరింది. మే 3న ప్రారంభమైన మణిపూర్ హింసాకాండలో ఇప్పటివరకు 150 మందికిపైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. మణిపూర్‌లో మూడు నెలలుగా ఇంటర్నెట్ లేదు.
Also read : Vastu Tips: ఇంట్లో ఈ మొక్కను పెంచితే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం?