Railway Tickets : అన్ని రకాల రైల్వే టికెట్లపై ఏటా రూ.56,993 కోట్ల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని రైల్వేశాఖ మంత్రి(Railway Tickets) అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రతి రైల్వే టికెట్‌పై రైల్వేశాఖ 46 శాతం రాయితీని భరిస్తోందని ఆయన తెలిపారు. ఒక్కో ప్రయాణికుడు రైల్వే టికెట్‌పై రూ.100 ఖర్చు పెట్టాల్సిన చోట రూ.54 మాత్రమే ఖర్చు పెట్టేలా చూస్తున్నామన్నారు. ఈ రాయితీ అన్ని రైల్వే టికెట్ తరగతుల ప్రయాణికులకు లభిస్తోందని పేర్కొన్నారు.
Also Read :India Vote : పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణను వ్యతిరేకిస్తూ ఐరాస తీర్మానం.. అనుకూలంగా భారత్ ఓటు
గుజరాత్‌లోని భుజ్, అహ్మదాబాద్ మధ్య ఇప్పటికే నమో భారత్ రైలు సేవలను ప్రారంభించామని రైల్వేశాఖ మంత్రి తెలిపారు. ఈ రెండు ప్రాంతాల మధ్యనున్న 359 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 45 నిమిషాల్లో నమో భారత్ రైలు చేరుకుంటుందన్నారు. తాజాగా జరిగిన లోక్‌సభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఈవివరాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.