భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ముగిసింది. కోట్ల మంది ఆరాధించే అయోధ్య రామాలయంలో బాల రాముడి (Ram Lalla)విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఇక ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసిన తర్వాత మోడీ (Prime Minister Narendra Modi) తన ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్నీటిపర్యంతం అయ్యారు.
ఈ రోజు కోసం ఎన్నో వందల ఏళ్లుగా ఎదురు చూశామని, ఇన్నాళ్లకు ఈ కల సాకారమైందని అన్నారు. ఎన్నో శతాబ్దాల తరవాత అయోధ్యకు రాముడు వచ్చాడని అన్నారు. ఇకపై రాముడు టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయోధ్యకు రాముడి రాకతో దేశంలో నవ శకం మొదలైందని అన్నారు. ’22 జనవరి 2024. ఇది క్యాలెండర్లో కేవలం ఓ తేదీ కాదు. ఓ కొత్త కాలచక్రం ఆరంభమైన రోజు’ అని వ్యాఖ్యానించారు. ‘రాముడు ఇప్పుడు టెంట్లో లేడు. మందిరంలో ఉన్నాడు. వందల సంవత్సరాల ఎదురుచూపులు, వేలమంది ప్రాణత్యాగాల తర్వాత రాముడొచ్చాడు’ అని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
రామనామం ఈ దేశ ప్రజల అణువణువునా నిండి ఉందని.. రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యమని ప్రధాని మోడీ కొనియాడారు. ‘ ఈ శుభ గడియల కోసం 11 రోజులు దీక్ష వహించా. ఈ పవిత్ర కార్యం ఆలస్యమైనందుకు క్షమించాలని రాముడిని వేడుకుంటున్నా. స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాల పాటు మందిరం కోసం న్యాయపోరాటం చేశాం. ఇవాళ ఆ కల సాకారం అయ్యింది. ఈ రాత్రికి ప్రతి ఇంటా దీపాలు వెలగాలి’ అని ఆకాంక్షించారు.
సీఎం యోగి (CM Yogi) మాట్లాడుతూ.. దేశంలోని వాతావరణం చూస్తే మళ్లీ త్రేతాయుగంలోకి వెళ్లినట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు. మందిరాన్ని అక్కడే నిర్మించాం అంటూ హర్షం వ్యక్తం చేశారు. ‘చాలా భావోద్వేగంగా ఉంది. కచ్చితంగా మీ అందరికీ కూడా ఇలాగే ఉండి ఉంటుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి నగరం, ప్రతి గ్రామం అయోధ్యనే. ప్రతి మదిలోనూ రాముడే. ప్రతి కన్నూ తడుస్తోంది. ప్రతి నోరూ రాముడిని జపిస్తోంది’ అని పేర్కొన్నారు.
Read Also : PM Modi Katora Deeksha : ప్రాణ ప్రతిష్ట అనంతరం దీక్ష విరమించిన ప్రధాని మోడీ..