One Nation One Election : జమిలి ఎన్నికల కమిటీకి 5వేల సూచనలు.. లాస్ట్ డేట్ జనవరి 15

One Nation One Election : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కేంద్ర సర్కారు ఏర్పాటుచేసిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కమిటీకి ప్రజల నుంచి ఇప్పటివరకు 5వేలకుపైగా సలహాలు, సూచనలు వచ్చాయి.

  • Written By:
  • Updated On - January 10, 2024 / 05:19 PM IST

One Nation One Election : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కేంద్ర సర్కారు ఏర్పాటుచేసిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కమిటీకి ప్రజల నుంచి ఇప్పటివరకు 5వేలకుపైగా సలహాలు, సూచనలు వచ్చాయి. లాస్ట్ డేట్ జనవరి 15 కావడంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు వచ్చిన 5వేలకుపైగా సూచనలన్నీ ఈ-మెయిళ్ల ద్వారా అందాయని అధికార వర్గాలు తెలిపాయి. జమిలి ఎన్నికల నిర్వహణ కోసం ప్రస్తుతమున్న చట్టపరమైన అడ్మినిస్ట్రేటివ్‌ ఫ్రేమ్‌వర్క్‌లో ఏవిధమైన మార్పులు చేర్పులు  చేస్తే బాగుంటుందనే దానిపై సూచనలు చేయాలని మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సారథ్యంలోని వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ఇటీవల కోరింది. జనవరి 15లోగా ప్రజలు తమ సలహాలు, సూచనలను పంపొచ్చని వెల్లడించింది. కమిటీ వెబ్‌సైట్‌ onoe.gov.in లో సూచనలను పోస్ట్ చేయాలని లేదంటే sc-hlc@gov.in ఐడీకి కూడా ఈ-మెయిల్‌ చేయొచ్చని కోరింది. జమిలి ఎన్నికలపై స్టడీ చేసేందుకు ఈ కమిటీ గతేడాది సెప్టెంబరులో ఏర్పాటైంది. అప్పటి నుంచి రెండుసార్లు సమావేశాలను నిర్వహించింది. ఇటీవల ఆరు జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించింది. దీనిపై న్యాయ కమిషన్‌ సలహాలను సైతం(One Nation One Election) స్వీకరించింది. ఈ అంశాలన్నీ కలిపి ఒక సమగ్ర తుది నివేదికను కమిటీ రూపొందించనుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర సర్కారు తదుపరి నిర్ణయాలను తీసుకుంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

జమిలి ఎన్నికల ప్రయోజనాలు

  • వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల నిధులతో పాటు సమయం ఆదా చేయవచ్చు.
  • పాలనాపరమైన పనులపై ఎన్నికల ప్రభావం తగ్గుతుంది.
  • అభివృద్ధి పనులకు ఎక్కువ సమయం దొరుకుతుంది.
  • ఎన్నికల నియమావళి దేశం మొత్తం ఒకేసారి అమల్లో ఉంటుంది.
  • పాలనాపరమైన పనులకు ఆటంకాలు తగ్గుతాయి.
  • రాజకీయ నాయకులు పాలసీల రూపకల్పనపై దృష్టి పెట్టడానికి అధిక సమయం దొరుకుతుంది.

Also Read: Congress – Ayodhya : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లం : కాంగ్రెస్

జమిలి ఎన్నికల సవాళ్లు

  • దేశంలోని ఓటర్లకు, అధికారులకు, ఎన్నికల నిర్వహణకు తగ్గ లాజిస్టిక్స్ అవసరం.
  • భద్రతా పరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
  • ఎన్నికల వేళ ప్రజలకు, పోలింగ్ సిబ్బందికి తగినంత భద్రత కల్పించడంలో సవాళ్లు ఎదురుకావచ్చు.
  • జాతీయ, ప్రాంతీయ సమస్యలు ఒకేసారి తెరపైకి వచ్చి గందరగోళం నెలకొనవచ్చు.
  • రాజ్యాంగబద్ధ సవరణ చేయడం కూడా పెద్ద సవాళుతో కూడుకున్న విషయమే.
  • ఓటర్లు లోక్‌సభ, అసెంబ్లీలో ఒకే పార్టీకి ఓటు వేసే అవకాశం ఉండొచ్చు.