Om Birla : కాబోయే లోక్‌సభ స్పీకర్ ఎవరు ? అనే దానిపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో కీలక వార్త బయటికి వచ్చింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తరఫున మరోసారి స్పీకర్ పదవి రేసులో మాజీ స్పీకర్ ఓం బిర్లాయే ఉండబోతున్నారు. ఆయన పేరునే ఎన్డీయే కూటమి ఈసారి కూడా ప్రపోజ్ చేయబోతోంది. ఇంకాసేపట్లో ఓం బిర్లా తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఇవాళ ఉదయం ప్రధాని మోడీతో ఓంబిర్లా భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో వరుసగా రెండోసారి రాజస్థాన్‌లోని కోటా నుంచి లోక్‌సభకు ఓంబిర్లా(Om Birla) ఎన్నికయ్యారు. దీంతో ఆయనకే అవకాశం ఇవ్వాలని ప్రధాని మోడీ నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join
లోక్‌సభ చరిత్రలో తొలిసారిగా స్పీకర్ పదవికి కూడా ఎన్నిక జరగబోతోంది. ఎన్డీయే కూటమి అభ్యర్థి ఓంబిర్లాపై కొడికున్నిల్ సురేష్‌ను విపక్ష ఇండియా కూటమి పోటీకి నిలిపింది. ఆయన ఇవాళ ఉదయాన్నే తన నామినేషన్‌ను సమర్పించారు. సురేష్ కేరళ నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్ పదవికి విపక్షాలు పోటీ చేయకూడదని భావిస్తే.. తమకు డిప్యూటీ స్పీకర్ పదవిని వదిలేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. అయితే అందుకు ఎన్డీయే కూటమి నో చెప్పింది. దీంతో తమవంతుగా పోటీ ఇచ్చే లక్ష్యంతో కొడికున్నిల్ సురేష్‌ను తమ అభ్యర్థిగా ఇండియా కూటమి బరిలోకి దింపింది. తదుపరిగా డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా విపక్ష ఇండియా కూటమి తమ అభ్యర్థిని బరిలోకి దింపనుంది.
Also Read :MLC Jeevan Reddy : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతాను : జీవన్‌రెడ్డి
2014, 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీయే కూటమికి భారీ మెజారిటీ ఉండటంతో స్పీకర్ అభ్యర్థికి పోటీ అనేది లేకుండా పోయింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. విపక్ష ఇండియా కూటమికి కూడా మెరుగైన సంఖ్యా బలం ఉంది. అయితే ఈదఫా స్పీకర్ పదవికి సంబంధించిన ఎన్నికలోనూ ఎన్డీయే కూటమితో తలపడబోతోంది. ప్రస్తుతం బీజేపీ వద్ద లోక్‌సభ 240 సీట్లు ఉన్నాయి. దాని మిత్రపక్షాల వద్ద దాదాపు 53 సీట్లు ఉన్నాయి. విపక్ష ఇండియా కూటమి వద్ద 234 లోక్‌సభ సీట్లు ఉన్నాయి.