Manmohan Friend : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పెరిగింది భారతదేశంలోనే అయినా.. పుట్టింది మాత్రం పాకిస్తాన్‌లోనే. ఇస్లామాబాద్ నగర వాయవ్య సరిహద్దులకు 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న గహ్ అనే గ్రామంలో 1932 సంవత్సరం సెప్టెంబరు 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. ఆయన తండ్రి గురుముఖ్ సింగ్ బట్టల వ్యాపారం చేసేవారు. తల్లి అమృత్ కౌర్ గృహిణి. నాలుగో తరగతి వరకు గహ్ గ్రామంలోనే మన్మోహన్ చదువుకున్నారు. ఆ ఊరిలో మన్మోహన్ సింగ్‌కు ఒక బాల్య స్నేహితుడు ఉండేవాడు. అతడి పేరు రజా మహ్మద్ అలీ.
Also Read :Sharmistha Vs Congress : ‘‘మా నాన్న మరణించినప్పుడు మీరేం చేశారు’’.. కాంగ్రెస్‌కు ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠా ప్రశ్న
2008 సంవత్సరంలో మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో రజా మహ్మద్ అలీ ఢిల్లీకి(Manmohan Friend) వచ్చి.. మన్మోహన్ సింగ్‌ను కలిశారు. 1947లో భారతదేశం రెండు ముక్కలైంది. పాకిస్తాన్, భారత్‌లుగా విడిపోయింది. ఆ టైంలో మన్మోహన్ ఫ్యామిలీ భారత్‌కు వచ్చేయడంతో తన ఫ్రెండ్స్‌కు మన్మోహన్ దూరమయ్యారు. 2004లో మన్మోహన్ సింగ్ భారత ప్రధాని అయ్యారని తెలియడంతో పాకిస్తాన్‌లోని గహ్ గ్రామంలో ఉన్న రజా మహ్మద్ అలీ సంతోషపడ్డాడు. ఎలాగైనా తన స్నేహితుడిని కలవాలని డిసైడ్ అయ్యాడు. ఈక్రమంలోనే 2008లో ఢిల్లీకి వచ్చిన మన్మోహన్‌ను కలిశాడు. చిన్నప్పుడు మన్మోహన్‌ను ‘మోహ్నా’ అని పిలిచేవాడినని.. అప్పట్లో రజా మహ్మద్ అలీ గుర్తు చేసుకున్నారు. తమ చిన్ననాటి ఆటలు ఇంకా కళ్లెదుట కదులుతున్నాయని ఆయన ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.
Also Read :Fees Fear : ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీ‘జులుం’.. నియంత్రణకు రెడీ అవుతున్న రేవంత్ సర్కార్
మన్మోహన్‌ను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన టైంలో రజా మహ్మద్ అలీ అపురూప కానుకలను తీసుకొచ్చారు. మన్మోహన్ స్వగ్రామం గహ్ నుంచి మట్టిని, నీటిని తీసుకొచ్చారు. గహ్ గ్రామం ఫొటోను మన్మోహన్‌కు కానుకగా అందించారు. ఇక మన్మోహన్ సింగ్ తన తరఫున ఫ్రెండ్ రజా మహ్మద్ అలీకి టైటాన్ గడియారపు సెట్, ఒక స్కార్ఫ్‌లను కానుకలుగా అందించారు. నాయకుడిగా, పాలకుడిగానే కాకుండా మంచి స్నేహితుడిగానూ మన్మోహన్ సింగ్ పేరు తెచ్చుకున్నారు. తన బాల్య స్నేహితుడు వస్తే చాలా ఆప్యాయంగా ఆదరించారు. పెద్ద స్థానంలో ఉన్నాననే గర్వభావాన్ని కొంచెం కూడా చూపించలేదు. హ్యాట్సాఫ్ టు మన్మోహన్ జీ.