Site icon HashtagU Telugu

Gujarat : సీఎం సభలో పడుకున్న అధికారి.. విధి నిర్లక్ష్యం అంటూ సస్పెండ్..

Officer caught sleeping while CM Speech in a Public event and suspended

Officer caught sleeping while CM Speech in a Public event and suspended

కొంతమంది అధికారులు(Officers), ప్రజాప్రతినిధులు సభల్లో, ఆఫీసుల్లో నిద్రపోతూ(Sleep) నిర్లక్షానికి ప్రతినిధులుగా నిలుస్తారు. తాజాగా ఇలాగే ఓ అధికారి ఏకంగా సీఎం(CM) సభలో సీఎం మాట్లాడుతుండగా నిద్రపోవడంతో అతన్ని విధుల నుంచి తప్పించారు.

గుజరాత్ లోని భుజ్ లో భూకంప బాధితులకు పునరావాసం కల్పిస్తూ ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. అర్హులైన వారికి ఆ ఇళ్ల పట్టాలను సీఎం చేతుల మీదుగా అందించారు. అనంతరం సీఎం భూపేంద్ర పటేల్ సభలో మాట్లాడారు. అయితే సీఎం మాట్లాడేటప్పుడు సభలో ముందు వరుసలోనే కూర్చున్న ఓ అధికారి హాయిగా నిద్రపోయాడు.

సీఎం సభలో అధికారి పడుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఉన్నతాధికారులు ఈ విషయంపై సీరియస్ అయి ఆ వీడియోలో కనిపిస్తున్న అధికారి భుజ్ మునిసిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ గా గుర్తించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం నిబంధనల ప్రకారం ఆయనను విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేశారు.

 

Also Read :  TDP MLA Husband Arrested: రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ అప్పారావు అరెస్ట్