Spy Pigeon: మరో అనుమానాస్పద గూఢచారి పావురాన్ని పట్టుకున్న పోలీసులు

పూరీలో గూఢచారి పావురాన్ని (Spy Pigeon) మత్స్యకారులు పట్టుకున్న వారం రోజులకే, బుధవారం పూరీలోని అస్తరంగా పోలీసు పరిధిలోని నాన్‌పూర్‌లో అనుమానాస్పద ట్యాగ్‌తో మరో పావురం పట్టుబడింది.

  • Written By:
  • Publish Date - March 16, 2023 / 01:34 PM IST

పూరీలో గూఢచారి పావురాన్ని (Spy Pigeon) మత్స్యకారులు పట్టుకున్న వారం రోజులకే, బుధవారం పూరీలోని అస్తరంగా పోలీసు పరిధిలోని నాన్‌పూర్‌లో అనుమానాస్పద ట్యాగ్‌తో మరో పావురం పట్టుబడింది. నివేదికల ప్రకారం.. ఈ అనుమానాస్పద పావురం గత ఎనిమిది రోజులుగా ఈ ప్రాంతంలో అక్కడక్కడ సాధారణంగా తిరుగుతూ కనిపించింది. పాదాలకు ట్యాగ్ ఉండడంతో ఏదో లోపం ఉందన్న అనుమానంతో స్థానికులు కొందరు బుధవారం చేపల వలతో పట్టుకున్నారు. పావురం రెండు పాదాలకు మూడు ట్యాగ్‌లు ఉన్నాయి. ఒక ట్యాగ్‌పై ‘రెడ్డి VSP DN’ అని రాసి ఉండగా, మరో ట్యాగ్‌పై 31 నంబర్ రాసి ఉంది. ఈ పావురం వారం రోజులుగా ఆ ప్రాంతంలో ఉందని అధికారులు పేర్కొన్నారు.

మా ఇంట్లో కొన్ని పెంపుడు పావురాలు ఉన్నాయని స్థానిక పావురం పట్టే వ్యక్తి బిక్రమ్ పతి చెప్పాడు. గత వారం రోజులుగా ఈ పావురాన్ని చూస్తూనే ఉన్నాం అందులో ఏదో వింత కనిపించింది. ఇతర పావురాల మాదిరిగా కాకుండా ఇది మందలుగా కాకుండా విడిగా జీవించేది. మేము దాని కాళ్ళపై కొన్ని ట్యాగ్‌లను కూడా చూశాము. కాబట్టి మేము దానిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. పావురాన్ని పట్టుకోని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: ED Kavitha : ఢిల్లీలో హైడ్రామా, విచార‌ణ,అరెస్ట్ పై ఉత్కంఠ‌

కోణార్క్ ప్రాంతంలోని రామచండి వద్ద మార్చి 6న ఇలాంటి పావురాన్ని పట్టుకోవడం గమనార్హం. పావురానికి ఒక చిన్న స్పై కెమెరా, GPSగా కనిపించే చిప్‌తో ట్యాగ్ చేయబడిన పావురాన్ని పట్టుకున్నారు అధికారులు. ఆ పావురం రెక్కలపై నీలం, ఎరుపు రంగుల్లో విదేశీ భాషలో రహస్య సంకేత సందేశం రాసి ఉందని మత్స్యకారులు చెప్పారు. రాష్ట్ర ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ దాని రహస్యాన్ని ఛేదించకపోవడంతో దానిని దర్యాప్తు కోసం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సిఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపారు.