NPCIL Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా ? టెన్త్, ఇంటర్ పాసయ్యారా ? అయితే ఇది మీకు మంచి అవకాశం. దాదాపు 270కిపైగా జాబ్స్ భర్తీకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
ఎన్పీసీఐఎల్‌లో(NPCIL Jobs) మొత్తం 270కిపైగా ఉద్యోగాలు ఉండగా.. వాటిలో 153 కేటగిరీ-2 స్థాయి స్టైపెండరీ ట్రైనీ ఆపరేటర్ పోస్టులు. ఇక మిగిలిన 126 పోస్టులు కేటగిరీ-2 స్థాయి స్టైపెండరీ ట్రైనీ మెయింటైనర్‌కు సంబంధించినవి. ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి 10th, ITI, ఇంటర్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపులు లభిస్తాయి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీల అభ్యర్థులు, మహిళలకు అప్లికేషన్ ఫీజు లేదు.
Also Read :DNA Report : వైద్యురాలిపై అఘాయిత్యం కేసు.. కీలకంగా డీఎన్ఏ రిపోర్టు
ఈ జాబ్స్‌కు అప్లై చేసే వారిని రెండు దశల్లో పరీక్షిస్తారు. మొదటి దశలో జరిగే పరీక్షను ప్రిలిమినరీ అంటారు. రెండో దశలో జరిగే పరీక్షను అడ్వాన్స్‌డ్ అంటారు. ఆపరేటర్ జాబ్‌కు అప్లై చేసిన వారికి స్కిల్ టెస్టు ఉండదు. మెయింటైనర్ జాబ్‌కు అప్లై చేసిన వారికి మాత్రం తప్పకుండా స్కిల్ టెస్టు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైతే రెండేళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈక్రమంలో మొదటి సంవత్సరంలో ప్రతినెలా రూ.20వేలు చొప్పున స్టైపెండ్‌గా చెల్లిస్తారు. రెండో సంవత్సరంలో ప్రతినెలా రూ.22వేలు స్టైపెండ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయ్యాక ప్రతినెలా రూ.32వేల దాకా శాలరీ వస్తుంది. అభ్యర్థులు NPCIL అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తును సమర్పించవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 11. చివరి రోజున సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తులను సమర్పించాలి.