Site icon HashtagU Telugu

Nitin Gadkari : నాలుగోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామో, రామో చెప్పలేను: గడ్కరీ

Nitin Gadkari Bjp Pm Modi Nda Govt

Nitin Gadkari : తమ ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందో, లేదో చెప్పలేమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అయితే  రాందాస్‌ అథవాలే కచ్చితంగా మళ్లీ మంత్రి అవుతారన్న గ్యారంటీ మాత్రం తాను ఇవ్వగలనని ఆయన చెప్పారు. మహారాష్ట్రలోని నాగ్‌‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాందాస్ అథవాలేను ఉద్దేశించి  గడ్కరీ ఈ సరదా కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు కార్యక్రమ వేదికపై  అథవాలే కూడా ఉన్నారు. గడ్కరీ (Nitin Gadkari) కామెంట్స్ విని రాందాస్ అథవాలే నవ్వారు. దీంతో స్పందించిన  గడ్కరీ.. ‘‘నేను జోక్ చేశాను’’ అని చెప్పారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) నాయకుడైన అథవాలే ఇప్పటివరకు మూడుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో ఆర్‌పీఐ పార్టీ కూడా భాగంగా ఉంది.

Also Read :Rail Tracks : రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లు.. మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర

త్వరలో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాల్లో తాము పోటీచేస్తామని కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. అజిత్ పవార్ పార్టీ మహాయుతి కూటమిలో చేరడంతో తమ పార్టీకి (ఆర్పీఐ) రాష్ట్రంలో రావాల్సిన కొన్ని పదవులు రాలేదని పేర్కొన్నారు. పలు క్యాబినెట్‌ పదవులు, రెండు కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులు, జిల్లా స్థాయి కమిటీ పదవులు తమ పార్టీ నేతలకు కేటాయించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాందాస్ అథవాలే రాజకీయ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఈ ఎన్నికల్లో పోటీ పడనుంది.

Also Read :Bangalore Fridge Horror: మహాలక్ష్మి హత్య కేసు కీలక పరిణామం.. నిందితుల ఆచూకీ లభ్యం..

ప్రజాస్వామ్యం అనే అంశంపై ఇటీవలే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వ్యతిరేకించే వర్గాల వారి మాటను వినడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష అని ఆయన పేర్కొన్నారు. రచయితలు, మేధావులు, కవులు నిర్భయంగా తమ భావాలను వ్యక్తీకరించే పరిస్థితులు దేశంలో ఉండాలన్నారు.  ‘‘మనం రైటిస్టులు, లెఫ్టిస్టులం కాదు. మనం అవకాశవాదులం. రచయితలు, మేధావులు ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం సమాజంలో ఉండాలి’’ అని గడ్కరీ చెప్పారు. ఎదుటి వారి లోపాలను ఎత్తిచూపే అవకాశాన్ని విమర్శకులకు కల్పించాలన్నారు.