Site icon HashtagU Telugu

Sex Crimes: అత్యాచారానికి పాల్పడితే నో జాబ్

Sex Crimes

New Web Story Copy 2023 08 08t210234.347

Sex Crimes: దేశంలో అత్యాచార కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నానాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. బాధాకర విషయం ఏంటంటే అత్యాచార బారీన పడుతున్న వారిలో మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. వృద్దులపై కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.

రాజస్థాన్ ప్రభుత్వం అత్యాచారం మరియు ఇతర నేరాలకు పాల్పడిన వ్యక్తులను ప్రభుత్వ ఉద్యోగాల నుండి నిషేధించాలని నిర్ణయించింది, భిల్వారాలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్యపై నిరసనల మధ్య ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన క్యారెక్టర్ సర్టిఫికెట్‌లపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. అత్యాచారం చేసిన నిందితులు, మహిళలను వేధించే వారిని ప్రభుత్వ ఉద్యోగాల నుండి నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని గెహ్లాట్ చెప్పారు. ఇలాంటి సంఘ వ్యతిరేక వ్యక్తులపై సామాజిక బహిష్కరణ అవసరం అని గెహ్లాట్ ట్వీట్ చేశారు.

ఆగస్టు 2న భిల్వారా జిల్లాలో పశువులను మేపేందుకు వెళ్లిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, చంపి, ఆపై బొగ్గు కొలిమిలో కాల్చి చంపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఓ మహిళ సహా ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ విషయంలో పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకున్నారని, నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. అయితే దీనిపై రాజకీయం చేస్తున్నారని, అది సరైన పద్దతి కాదని సూచించారు.

Also Read: Nandi: నందీశ్వరుని చెవిలో చెప్పిన కోరికలు నెరవేరుతాయా.. ఇందులో నిజమెంత?