Gadkari Vs Caste Politics: కుల, మత రాజకీయాలకు తాను వ్యతిరేకినని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాజకీయాలు చేసే క్రమంలో తాను కులాన్ని కానీ, మతాన్ని కానీ అస్సలు పట్టించుకోనని ఆయన తేల్చి చెప్పారు. ఒక వ్యక్తికి గుర్తింపు అనేది కులం, వర్గం, మతం, భాష, లింగం ద్వారా రాదని.. అతడి లక్షణాల ఆధారంగానే గుర్తింపు దక్కుతుందన్నారు. కులం, మతంతో వచ్చే ఓట్లు తనకు అక్కర్లేదన్నారు. ‘‘2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 50వేల మంది హాజరైన ఒక సభలో నేను ప్రసంగించాను. వాళ్లందరికీ ఒక విషయం క్లియర్‌గా చెప్పాను. ఎవరైనా కులం గురించి తనతో మాట్లాడితే.. లాగి తంతాను అని వార్నింగ్ ఇచ్చాను’’ అని గడ్కరీ గుర్తు చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సెంట్రల్ ఇండియా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ స్నాతకోత్సవం వేదికగా కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ దేశానికి అడగకుండానే ఎన్నో ఇచ్చారు. ఆయనను ఈ దేశం ఎన్నటికీ మరువదు. కలాంలోని లక్షణాలే ఆయనకు గుర్తింపును తెచ్చాయి. కులం, మతం వల్ల కలాంకు విలువ దక్కలేదు’’ అని గడ్కరీ చెప్పుకొచ్చారు.
#WATCH | Maharashtra | Addressing an event in Nagpur, Union Minister Nitin Gadkari says, “… A person is not known by their caste, sect, religion, language or sex, but only by their qualities. That is why we will not discriminate against anyone based on caste, sect, religion,… pic.twitter.com/q3XbRhjSnS
— ANI (@ANI) March 16, 2025
Also Read :Hafiz Saeed : హఫీజ్ సయీద్ రైట్ హ్యాండ్ లేనట్టే.. అబూ ఖతల్ మర్డర్
గడ్కరీ డేరింగ్, డైనమిక్..
ఓ వైపు మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు మత ప్రాతిపదికన ఔరంగజేబు(Gadkari Vs Caste Politics) సమాధిపై వ్యాఖ్యలు చేస్తోంది. మరోవైపు అదే రాష్ట్రంలోని నాగ్‌పూర్ వేదికగా గడ్కరీ తనకు మత రాజకీయాలు పట్టవని తేల్చి చెబుతున్నారు. బీజేపీలోని నేతల అభిప్రాయాల్లోనూ తేడాలు ఉన్నాయనే విషయం ఈ విభిన్న వ్యాఖ్యలతో తేటతెల్లం అవుతోంది. పలువురు కమలదళం నేతలకు మత రాజకీయాలంటే నచ్చదని స్పష్టంగా అర్థమవుతోంది. గడ్కరీలా డైనమిక్‌గా, డేరింగ్‌గా ఈ విషయాన్ని చెప్పేవారు కొందరే బీజేపీలో ఉన్నారు. ఇంకొంతమంది బీజేపీ కీలక నేతలకు కూడా ఇదే విధమైన అభిప్రాయం ఉన్నప్పటికీ.. సాహసం చేసి బయటికి చెప్పలేకపోతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.