Site icon HashtagU Telugu

Nithyananda : నిత్యానంద స్వామి లొకేషన్ అదే.. ఎక్కడికీ వెళ్లలేడు !?

Nithyananda Swami Nepal Bhutan India Uttar Pradesh Gorakhpur

Nithyananda :  వివాదాస్పద స్వామీజీ నిత్యానంద ఎక్కడ దాక్కున్నాడు ? ఎలా ఉన్నాడు ? అనే దానిపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.  లైంగిక వేధింపులు, పిల్లల కిడ్నాప్‌ సహా పలు కేసుల్లో నిత్యానందను 2019లో నేరస్థుడిగా భారత్‌‌లోని కోర్టులు ప్రకటించాయి. దీంతో అతడు భారతదేశ చట్టాలను గౌరవించలేదు. ఏకంగా సొంత దేశాన్ని వదిలి పరారయ్యాడు. అప్పట్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ మార్గంలో నేపాల్‌కు నిత్యానంద వెళ్లి ఉంటాడని తెలుస్తోంది. 2019లో దేశం విడిచి పరార్ అయ్యే సమయానికే నిత్యానంద పాస్‌పోర్టు గడువు ముగిసింది. అంటే ఇక అది చెల్లదు. వివిధ కేసుల్లో నేరస్తుడిగా శిక్ష అనుభవించాల్సి ఉన్నందున.. నిత్యానంద పాస్‌పోర్టు గడువును భారత ప్రభుత్వం పొడిగించే అవకాశాలు లేవు. ఈవిషయం నిత్యానందుకు బాగా  తెలుసు.అందుకే అతడు విమానాల్లో విదేశాలకు పరార్ కాలేక.. భూమార్గంలో సేఫ్‌గా నేపాల్‌లో ల్యాండ్ అయ్యాడు.

Also Read :Chessboard Killer : 63 సీరియల్ మర్డర్లు.. ‘చెస్ బోర్డ్ కిల్లర్’ రియల్ స్టోరీ

ఆ రెండు దేశాల్లోనే ఏదో ఒకచోట

మన భారతదేశం నుంచి ఎలాంటి పాస్‌పోర్టు, వీసా లేకుండానే నేరుగా నేపాల్, భూటాన్‌లకు వెళ్లొచ్చు. అందుకే తొలుత నేపాల్‌లోకి, అక్కడి నుంచి భూటాన్‌లోకి నిత్యానంద వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. బహుశా.. ఆ రెండు దేశాల్లోనే ఏదో ఒకచోట నిత్యానంద(Nithyananda) దాచుకొని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారత గూఢచార వర్గాలు, నిఘా వర్గాలు పూర్తి ఫోకస్ పెడితే తప్పకుండా ఆ రెండు దేశాల్లో జల్లెడపట్టి నిత్యానందను పట్టుకోవచ్చని అంటున్నారు. నేపాల్, భూటాన్‌లలో ఫేక్ పాస్‌పోర్ట్ మాఫియాలు ఎక్కువ. వాటి  సహకారంతో ఊరు, పేరు మార్చేసుకొని నిత్యానంద.. కొత్త అడ్రస్‌తో పాస్‌పోర్టును పొంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ రెండు దేశాల విదేశాంగ శాఖల సహకారంతో భారత ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తే ఈవివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది.

Also Read :Electric Vehicles : ఎలక్ట్రిక్‌ స్కూటర్ కొనబోతున్నారా ? ఈ రిపోర్ట్‌పై లుక్కేయండి

నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో.. 

నేపాల్‌‌తో భూమార్గంలో బార్డర్ పంచుకునే దేశాల జాబితాలో.. భారత్, చైనీస్ టిబెట్ మాత్రమే ఉన్నాయి. భారత్‌లోకి ఎలాగూ నిత్యానంద రాడు. చైనీస్ టిబెట్‌లోకి వెళ్లేందుకూ సాహసించడు. ఎందుకంటే అక్కడ ఫేక్ గాళ్ల ఆటచెల్లదు. చైనా సైన్యం ప్రతీ పర్యాటకుడు, సందర్శకుడి ట్రాక్ రికార్డును నిశితంగా చెక్ చేస్తుంది.భూటాన్‌తో భూమార్గంలో బార్డర్ పంచుకునే దేశాల జాబితాలో.. భారత్, చైనా మాత్రమే ఉన్నాయి. ఈ రెండుదేశాల్లోకి నిత్యానంద అడుగుపెట్టే ఛాన్సే లేదు. అందుకే ప్రస్తుతం నేపాల్ లేదా భూటాన్‌లలో నిత్యానంద తలదాచుకొని ఉండొచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది.