Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు త‌ప్పిన ప్ర‌మాదం..!

ఈ పర్యటన సందర్భంగా ఆర్థిక మంత్రి సీతారామన్ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్‌ను కలుస్తారు. ఆ తర్వాత ఆమె ప్రధానమంత్రి డాషో షేరింగ్ టోబ్గేతో సమావేశమవుతారు.

Published By: HashtagU Telugu Desk
Nirmala Sitharaman

Nirmala Sitharaman

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధికారిక పర్యటన కోసం భూటాన్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యంలో వాతావరణం చాలా ప్రతికూలంగా మారింది. దీంతో ఆమె విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో దించారు. ఆర్థిక మంత్రి రాత్రంతా సిలిగుడిలోనే బస చేశారు.

నిర్మలా సీతారామన్ నవంబర్ 2 వరకు భూటాన్‌లో అధికారిక పర్యటనలో ఉండ‌నున్నారు. ఈ సందర్భంగా ఆమె భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. ఈ పర్యటనలో ఆర్థిక మంత్రి వెంట ఆర్థిక వ్యవహారాల విభాగం (Department of Economic Affairs) బృందం కూడా ఉంది. సమాచారం ప్రకారం.. ఆర్థిక మంత్రి భూటాన్‌లో 1765లో స్థాపించబడిన చారిత్రక సాంగేన్ చోఖోర్ మఠాన్ని సందర్శించనున్నారు. ఇక్కడే 100 కంటే ఎక్కువ మంది భిక్షువులు ఉన్నత స్థాయి బౌద్ధ విద్యను అభ్యసిస్తున్నారు.

Also Read: India Victorious: వ‌న్డే క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన భార‌త మ‌హిళల జ‌ట్టు!

భూటాన్ పర్యటనలో ఉన్నత స్థాయి సమావేశాలు

ఈ పర్యటన సందర్భంగా ఆర్థిక మంత్రి సీతారామన్ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్‌ను కలుస్తారు. ఆ తర్వాత ఆమె ప్రధానమంత్రి డాషో షేరింగ్ టోబ్గేతో సమావేశమవుతారు. అంతేకాకుండా నిర్మలా సీతారామన్ భూటాన్ ఆర్థిక మంత్రి లేకీ డోర్జీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భారతదేశం-భూటాన్ ఆర్థిక, ద్రవ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం గురించి చర్చించనున్నారు.

  Last Updated: 31 Oct 2025, 09:32 AM IST