Site icon HashtagU Telugu

Interim Budget 2024-2025 : యూనియన్ బడ్జెట్ ను జస్ట్ 57 నిమిషాల్లో పూర్తి చేసిన నిర్మలా

Nirmala Budget Time

Nirmala Budget Time

గురువారం 2024 -25 కి సంబదించిన యూనియన్ బడ్జెట్ ను కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. 2024 – 25 కు సంబదించిన మధ్యంతర బడ్జెట్ (Budget 2024) కోసం సామాన్య ప్రజలు ,రైతులు (Common People, Farmers) ఎంతగానో ఎదురుచూసారు. అలాగే ఈ బడ్జెట్ ను మంత్రి ఎంతసేపు చదవుతుందో అని ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే నిర్మలా సీతారామన్ జస్ట్ 57 నిమిషాల్లోనే బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.

ఆర్థిక మంత్రిగా ఆమె ప్రసంగాల్లో ఇదే అత్యల్పం. ఇక అత్యధిక సమయం ప్రసంగించిన రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది. 2020-21 బడ్జెట్ ప్రవేశపెడుతూ 2.42 గంటలపాటు మాట్లాడారు. కానీ ఈసారి మాత్రం 57 నిమిషాల్లో పూర్తి చేసి ఆశ్చర్యం కలిగించారు. ‘ఇది మధ్యంతర బడ్జెట్ మాత్రమే. జులైలో పూర్తిస్థాయి బడ్జెట్తో వికసిత్ భారత్ సాధన కోసం మా ప్రభుత్వ వివరణాత్మక రోడ్ మ్యాప్ ను ప్రకటిస్తాం’ అని తెలిపారు. అయితే ఈ బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ప్రతిపక్షపార్టీలతో పాటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఈ బడ్జెట్ ఫై స్పందించారు. చాలా సమస్యలను ఆమె పట్టించుకోలేదని విమర్శించారు. ‘దేశంలో పెట్టుబడులు గణనీయంగా తగ్గుతోన్న విషయాన్ని అంగీకరించకుండా ఆమె విదేశీ పెట్టుబడుల గురించి మాట్లాడారు. అలాగే ఆమె ప్రసంగంలో విశ్వాసం, ఆశ లాంటి పదాలు వాడారు. కానీ గణాంకాల్లో అవేమీ కనపడలేదు’ అని పేర్కొన్నారు.

ప్రధాని మోడీ మాత్రం బడ్జెట్ ఫై ప్రశంసలు కురిపించారు. ‘ఇది సమ్మిళిత, సృజనాత్మక బడ్జెట్. దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. వికసిత్ భారత్కు మూల స్తంభాలైన పేదలు, యువత, మహిళలు, అన్నదాతల సాధికారతకు కృషి చేస్తుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ ఓ గ్యారంటీ’ అని పేర్కొన్నారు.

Read Also : Narendra Modi : వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా బడ్జెట్‌ రూపొందించాం