PM Modi : ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారిణి నిధి తివారీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014బ్యాచ్‌కు చెందిన ఆమె గతంలో వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్(వాణిజ్య పన్నులు)గా పనిచేశారు. 2022, నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో డిప్యూటీ సెక్రటరీగా నిధి తివారీ పనిచేస్తున్నారు. గతంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలోనూ.. అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేశారు. తాజాగా మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియమితులయ్యారు.
Read Also: Toll Taxes: టోల్ వ్యవస్థలో రేపటి నుంచి పెద్ద మార్పు!
వారణాసిలోని మెహముర్‌గంజ్‌కు చెందిన నిధి తివారీ.. సివిల్ సర్వీసెస్ పరీక్షలో 96వ ర్యాంక్ సాధించారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఈమె గతంలో వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్(వాణిజ్య పన్నులు)గా పని చేశారు. 2023 జనవరి 6 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇక, ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో బాధ్యతలు నిర్వర్తించారు. అంతర్జాతీయ సంబంధాల మెరుగుదలలో ఆమెకు ఉన్న నైపుణ్యమే పీఎంవోలో కీలకపాత్ర పోషించే స్థాయికి తీసుకొచ్చింది.
ప్రస్తుతం డిప్యూటీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న నిధి తివారీ.. కొత్త బాధ్యతలను త్వరలో చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన ఆదేశాలు త్వరలో వెల్లడించనున్నామని డీవోపీటీ ఒక ప్రకటనలో పేర్కొంది. నిధి తివారీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌కు ఫారెన్ అండ్ సెక్యూరిటీకి చెందిన అంశాలను నేరుగా ఆయనకు నివేదించడంలో కీలకపాత్ర వహించారు. ఇప్పటి వరకు ప్రధానమంత్రికి ఇద్దరు ప్రైవేట్ కార్యదర్శులు ఉన్నారు. ఒకరు వివేక్ కుమార్, ఇంకొకరు హార్దిక్ సతీశ్చంద్ర షా, ఇప్పుడు మూడో ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియమితులయ్యారు.