Covaxin : కొవాగ్జిన్ టీకాతోనూ సైడ్ ఎఫెక్ట్స్.. బనారస్ హిందూ వర్సిటీ స్టడీ రిపోర్ట్

కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనెకా) కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తాయంటూ ఇటీవల వచ్చిన నివేదికలు కలకలం క్రియేట్ చేశాయి.

  • Written By:
  • Updated On - May 16, 2024 / 01:43 PM IST

Covaxin : కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనెకా) కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తాయంటూ ఇటీవల వచ్చిన నివేదికలు కలకలం క్రియేట్ చేశాయి. వాటిని అంగీకరించిన ఆస్ట్రాజెనెకా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొవిషీల్డ్  టీకాల విక్రయాన్ని ఆపేస్తున్నామని  ప్రకటించింది. ఇప్పుడు తాజాగా కొవాగ్జిన్ కరోనా టీకాపైనా బనారస్ హిందూ యూనివర్సిటీ అధ్యయన నివేదిక బయటికి వచ్చింది. ఇది ‘స్ప్రింగర్ లింగ్’ జర్నల్‌లో పబ్లిష్ అయింది.

We’re now on WhatsApp. Click to Join

అధ్యయన నివేదిక ప్రకారం.. 

  • బనారస్ హిందూ యూనివర్సిటీ అధ్యయనంలో భాగంగా కౌమారదశలో ఉన్న 635 మంది, 291 మంది పెద్ద వయస్కులు  సహా మొత్తం 1,024 మందిపై కొవాగ్జిన్(Covaxin) టీకాను ఏడాది  పాటు పరీక్షించారు.
  • కొవాగ్జిన్ టీకా ప్రభావం వల్ల కౌమారదశలో ఉన్న వారిలో 47.9 శాతం మందిలో, పెద్ద వయస్కులలో 42.6 శాతం మందిలో  వైరల్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (శ్వాసకోశ సమస్య) వచ్చింది.
  • అలెర్జీ వంటి సమస్యలతో బాధపడుతున్న కౌమార దశలోని మహిళలపై కొవాగ్జిన్  టీకా తీవ్ర దుష్పరిణామాలు చూపిస్తోందని అధ్యయన నివేదిక తెలిపింది. వారికి అడ్వెర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంటెరెస్ట్ (ఏఈఎస్ఐ)  ముప్పు పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చింది.

Also Read : Varanasi Lok Sabha : ప్రధాని మోడీపై పోటీ.. 25వేల ఒక రూపాయి నాణేలతో నామినేషన్

  • అనాలిలాక్సిస్, మయో కార్డిటిస్, త్రోంబోసిస్ (రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం) వంటివి ఏఈఎస్ఐ రకం సైడ్ ఎఫెక్టులకు కొన్ని ఉదాహరణలు.
  • ఏఈఎస్ఐ రకం సైడ్ ఎఫెక్టుల వల్ల కొందరికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉంటుంది.  మరికొందరికి గులియన్‌-బారే సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఉంటుంది.
  • ఏఈఎస్ఐ బారినపడిన మహిళల్లో రుతుక్రమం, మస్కులో స్కెలటల్ వంటివి  గతి తప్పుతాయి.

Also Read :Phase 5 Polling : మే 20న ఐదో విడత పోలింగ్.. కీలక అభ్యర్థులు, స్థానాలివే

మే నెల మొదటివారంలో భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. తమ కొవాగ్జిన్ టీకాకు సేఫ్టీ రికార్డ్ ఉందని స్పష్టం చేసింది. భద్రతే ప్రధాన లక్ష్యంగా తాము వ్యాక్సిన్‌ని తయారు చేసినట్టు  వెల్లడించింది. కొవాగ్జిన్‌ భద్రమైందని, అది ఎంతో సమర్థంగా పని చేస్తుందని భారత్ బయోటెక్ వివరించింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కొవిడ్ 19 ఇమ్యూనైైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా జరిగిన  ట్రయల్స్‌‌లోనూ సత్ఫలితాలు వచ్చాయని తెలిపింది. కొవిడ్ 19 వ్యాక్సిన్‌లలో ఈ రికార్డు కేవలం కొవాగ్జిన్‌కి మాత్రమే ఉందని స్పష్టం చేసింది.