March 1st : మార్చి 1, 2024 వస్తోంది. కొత్త నెల నుంచి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. వాటి గురించి ముందే తెలుసుకోవడం మన బాధ్యత. లేదంటే ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఈ మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. అందుకే ఈ నెల చాలా ముఖ్యమైనది. కొత్త నెల(March 1st ) నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
గ్యాస్ ధరలకు రెక్కలు
సాధారణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెల 1వ తేదీన సమీక్షిస్తాయి. కొన్ని సార్లు ప్రతినెలా రెండో అర్ధ భాగంలోనూ ధరలు మారుస్తుంటాయి. ఫిబ్రవరి 1న కమెర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పులు చేయలేదు. మార్చి నెలలో వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచే ఛాన్స్ ఉందట. అదే జరిగితే కామన్ మ్యాన్‌పై భారం తప్పదు.
జీఎస్టీ కొత్త రూల్స్
మార్చి 1 నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కు సంబంధించిన కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. వాటి ప్రకారం కొత్త నెల నుంచి వ్యాపారులు కచ్చితంగా ఈ-ఇన్వాయిస్ ఇవ్వాలి. రూ.50 వేల పైన వస్తువుల విక్రయాలు జరిపినప్పుడు ఈ-బిల్స్ ఇవ్వాలి. మార్చి 1 నుంచి ఈ-ఇన్వాయిస్ లేకుండా ఇక ఈ-బిల్స్ ఇవ్వడం కుదరదు. రూ. 5 కోట్లు ఆపైన టర్నోవర్ ఉండి.. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎగుమతి, దిగుమతులు చేసే వ్యాపారులు ఈ-వే బిల్లులు ఇవ్వాలి. ఈ-ఇన్వాయిస్ లేకుండానే ఈ-వే బిల్లులు జారీ చేస్తున్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈమేరకు కొత్త రూల్స్‌ను అమల్లోకి తెస్తోంది. ఈ-ఇన్వాయిస్ ఇస్తేనే ఈ-వే బిల్లు జారీ అయ్యేలా మార్పులు చేసింది.
Also Read : Ration Card KYC : రేపే లాస్ట్ డేట్.. ఈ-కేవైసీ చేసుకోలేదో రేషన్ కార్డు కట్
క్రెడిట్ కార్డు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులకు సంబంధించి మార్చి నెల నుంచి నూతన నిబంధన పరిచయం చేయబోతోంది. క్రెడిట్ కార్డుల మినిమమ్ డే బిల్ కాలిక్యులేషన్ ప్రాసెస్‌లో ఎస్బీఐ పలు మార్పులు చేసింది. ఈ రూల్స్ మార్చి 15 నుంచి అమలులోకి వస్తుంది. దీనిపై ఎస్బీఐ క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం అందుతుంది.
పేటీఎం
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యవహారం అందరికీ తెలుసు. దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించడం ఫిబ్రవరిలో సంచలన అంశంగా మారింది. ఆర్బీఐ ఆంక్షలు మార్చి 15 తర్వాత అమలులోకి రానున్నాయి. ఆయా ఆంక్షల ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై బ్యాంకింగ్ సేవలను నిర్వహించదు. బ్యాంకింగ్ సేవల కోసం కొత్త కస్టమర్లను చేర్చుకోదు. డిపాజిట్ల సేకరణ, వాలెట్ లోడింగ్ వంటి కార్యకలాపాలను కూడా చేపట్టదు. అందుకే మనమంతా పేటీఎం ట్రాన్సాక్షన్స్ విషయంలో అలర్ట్‌గా ఉండాలి.