భారత ఆర్మీ(Indian Army)కి త్వరలోనే ఆధునిక ఆయుధాల రూపంలో శక్తివంతమైన గన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న స్టీరింగ్ కార్బైన్ల స్థానంలో సరికొత్త తరం CQB (Close Quarter Battle) కార్బైన్ మెషిన్ గన్లు (CQB Carbine) వచ్చేందుకు మార్గం సుగమమైంది. దీనిద్వారా భారత సాయుధ దళాల కోసం రక్షణ సామర్ధ్యాన్ని మరింతగా బలోపేతం చేయనుంది.
YSRCP Yuvatha Poru : రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైస్సార్సీపీ ‘యువత పోరు’
ఈ మెషిన్ గన్ల తయారీ కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) మరియు ప్రైవేట్ సంస్థ భారత్ ఫోర్జ్ మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ సుమారుగా రూ.2,000 కోట్లుగా ఉంది. దేశీయంగా ఆయుధాల తయారీలో ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని పురస్కరించుకుని తీసుకున్న ఈ చర్య దేశ రక్షణ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించనుంది.
CQB కార్బైన్లు ముఖ్యంగా సమీప యుద్ధాల్లో, నగర ప్రాంతాల యుద్ధాలు, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో కీలకంగా పనిచేస్తాయి. తక్కువ బరువుతో, వేగంగా ఉపయోగించదగిన ఈ ఆయుధాలు సైనికులకు సమర్థవంతమైన సహాయాన్ని అందించగలవు. ఈ మెషిన్ గన్ల అందుబాటుతో భారత సైన్యం శత్రుదేశాలపై మరింత బలంగా ఎదురుకొనే స్థితిలో ఉండనుంది. DRDO, భారత్ ఫోర్జ్ భాగస్వామ్యం ద్వారా దేశీయంగా తయారయ్యే ఈ గన్లు భవిష్యత్తులో దిగుమతులపై ఆధారాన్ని తగ్గించనున్నాయి.