IRCTC Train Tickets : పండుగల సీజన్ వేళ రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చే కీలక ప్రకటనను రైల్వేశాఖ చేసింది. ఇంతకుముందు 120 రోజులు ముందే ట్రైన్ టికెట్లను రిజర్వ్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ టైంను రైల్వేశాఖ 60 రోజులకు తగ్గించింది. అంటే ఇక నుంచి 60 రోజులు ముందుగానే అడ్వాన్స్ టికెట్లను రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రూల్ నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ లెక్కన అక్టోబర్ 31 వరకు ట్రైన్ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్‌లకు ఎలాంటి అవాంతరాలు ఉండవు. ట్రైన్ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్‌లో విదేశీ పర్యాటకులకు 365 రోజుల పరిమితి విషయంలో మాత్రం మార్పు ఉండదు. ముఖ్యమైన పండుగలు వచ్చినప్పుడు, సుదూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు రైల్వే ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. ఇందుకోసం అవసరమైన సమయాన్ని తగ్గించడం ప్రయాణికులకు ప్లస్ పాయింట్‌గా మారనుంది.
Also Read :Bathukamma Sarees : మహిళలకు బతుకమ్మ చీరలను మించిన ప్రయోజనాలు : సీతక్క
ఈ కొత్త మార్పు వల్ల అడ్వాన్స్ రైల్వే టికెట్లు బుక్ చేసుకున్న వారికి రైలులో కోరుకున్న సీట్లను కేటాయించే ఛాన్స్ దక్కనుంది. ఇందుకోసం రైల్వే శాఖ ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీని వాడుకోనుందట. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లతో పాటు భారతీయ రైల్వే రిజర్వేషన్ విధానాన్ని అమలుచేసే అన్ని ట్రైన్లకు ఈ రూల్స్ వర్తిస్తాయి. అంతకుముందు 90 రోజుల ముందుగా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. తదనంతరం ఈ గడువును 120 రోజులకు పొడిగించారు. ఇప్పుడు ఇదే గడువును 60 రోజులకు తగ్గించడం గమనార్హం. నాన్ ఏసీతో పాటు ఏసీ క్లాస్‌లో టికెట్లను ముందుగా రిజర్వేషన్ చేసుకునే వారు కూడా 60 రోజుల ముందుగానే టికెట్లు బుక్(IRCTC Train Tickets) చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read :Sheikh Hasina : షేక్ హసీనాపై బంగ్లాదేశ్ అరెస్టు వారెంట్.. భారత్ ఏం చేయబోతోంది ?
కరెంట్ టికెట్ బుకింగ్
కరెంట్ టికెట్ బుకింగ్ పద్ధతి ద్వారా రైలు బయలుదేరడానికి 3 నుంచి 4 గంటల ముందు టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో ప్రయాణికుల ఛార్ట్ రెడీ అయ్యాక కూడా టికెట్ కన్ఫామ్ అవుతుంది. రైలు కదిలే 5 నిమిషాల ముందు కూడా కరెంట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో టికెట్ దొరికితే సీటు కన్ఫామ్ అయినట్టే లెక్క. సాధారణ టికెట్ ధరతో పోలిస్తే ఈ కరెంట్ టికెట్ల ధరలు తక్కువగా ఉంటాయి.