EPFO New Feature : కంపెనీల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగికి పీఎఫ్ అకౌంటు ఉంటుంది. అందులోని వ్యక్తిగత సమాచారాన్ని మార్చుకోవడం అనేది ఇప్పటివరకు చాలా టఫ్. ఇక నుంచి ఈ ప్రక్రియ ఈజీ. ఎందుకంటే ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం కేంద్ర కార్మిక శాఖ సరికొత్త సంస్కరణలు చేసింది. పీఎఫ్ అకౌంటు కలిగిన వారు తమ వ్యక్తిగత సమాచారాన్ని తామే నేరుగా మార్చుకునే వెసులుబాటును కల్పించింది. ఈక్రమంలో కంపెనీ ప్రమేయం కానీ, ధ్రువీకరణ కానీ అక్కర్లేదు. ఇంతకుముందు ఈ సవరణల విషయంలో కంపెనీల ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండేది. అయితే కొన్ని అంశాలను ఈపీఎఫ్ఓ సభ్యులు గుర్తుంచుకోవాలి.
ఇవి తెలుసుకోండి..
2017 అక్టోబరు 1 తర్వాత యూఏఎన్ అకౌంటు నంబరును పొందిన వారికి మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటుంది. వీరు ఎలాంటి డాక్యుమెంట్లు, ధ్రువపత్రాలను సమర్పించకుండానే స్వయంగా వ్యక్తిగత వివరాలను మార్చుకోవచ్చు. 2017 అక్టోబరు 1 కంటే ముందే యూఏఎన్ అకౌంటును(EPFO New Feature) పొందినవారు తమ వ్యక్తిగత వివరాలలో సవరణల కోసం కంపెనీని సంప్రదించాలి. కంపెనీ నేరుగా ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో వారి వ్యక్తిగత వివరాలను మార్చొచ్చు. ఈక్రమంలో ఎవరైనా ఈపీఎఫ్ఓ సభ్యుడి యూఏఎన్ అనేది ఆధార్ కార్డుతో లింక్ అయి లేకుంటే.. ఆయా సవరణల సమాచారాన్ని ఈపీఎఫ్ఓ పరిశీలన కోసం పంపాలి.
Also Read :JioCoin : జియో కాయిన్.. ఎందుకు ? ఏమిటి ? ఎలా ?
దరఖాస్తుల్లో ఎక్కువ పెండింగ్‌లోనే..
- పీఎఫ్ అకౌంటులోని తమ వ్యక్తిగత వివరాలలో సవరణలు చేయాలంటూ ఉద్యోగులు తాము పనిచేసే కంపెనీలకు దరఖాస్తులు చేస్తుంటారు.
- ఈవిధంగా జనవరి 18 నాటికి మనదేశంలోని కంపెనీలకు ఉద్యోగుల నుంచి భారీగానే దరఖాస్తులు వచ్చాయట. వాటిలో ఇంకా 3.9 లక్షల దరఖాస్తులు పెండింగ్ దశలో ఉన్నాయట.
- అలా పెండింగులో దరఖాస్తులు ఉండటంతో ఈపీఎఫ్ఓ సభ్యులు విసిగివేసారి.. నేరుగా ఈపీఎఫ్ఓ విభాగానికి గ్రీవెన్సులు పంపుతున్నారు.
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓకు దాదాపు 8 లక్షలకుపైగా వినతులు అందాయి.
- కంపెనీకి దరఖాస్తు ఇచ్చి 10 రోజులు గడిచినా స్పందన రాకపోవడంతో.. ఈపీఎఫ్‌ఓకు అందిన వినతులే 47 శాతం దాకా ఉన్నాయి.
- కంపెనీకి దరఖాస్తు ఇచ్చి 5 రోజులు గడిచినా స్పందన రాకపోవడంతో.. ఈపీఎఫ్‌ఓకు అందిన వినతులు 40 శాతం దాకా ఉన్నాయి.