CBI – NEET : ‘నీట్‌’ వ్యవహారంపై సీబీఐ ఎఫ్‌ఐఆర్.. గుజరాత్, బిహార్‌కు టీమ్స్

నీట్ - యూజీ పరీక్షపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.

  • Written By:
  • Updated On - June 23, 2024 / 04:05 PM IST

CBI – NEET : మే 5న జరిగిన నీట్ – యూజీ పరీక్షపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. సీబీఐకు చెందిన టీమ్స్ ఇప్పటికే బిహార్, గుజరాత్ రాష్ట్రాలకు బయలుదేరాయి. కేంద్ర విద్యాశాఖ నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా ఇవాళ సీబీఐ ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను నమోదు చేసింది. నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై గత నెల రోజులుగా బీహార్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్నట్లుగా భావిస్తున్న 12 మందికిపైగా వ్యక్తులను అరెస్టు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

గుజరాత్‌లోని గోద్రాలో ఉన్న నీట్-యూజీ పరీక్షా కేంద్రంలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపైనా అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ కోచింగ్ సెంటర్ నిర్వహించిన ఓ వ్యక్తితో పాటు దాదాపు ఆరుగురిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారాలతో ముడిపడిన అన్ని వివరాలను సీబీఐ టీమ్స్(CBI – NEET) సేకరించనున్నాయి. ఆ రెండు రాష్ట్రాల పోలీసులు సేకరించిన ఆధారాలను కూడా పరిశీలించి విశ్లేషించనున్నాయి. ఇంకా ఇంటరాగేట్ చేయాల్సిన వారిపై సీబీఐ తదుపరిగా ఫోకస్ చేయనుంది. వారిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.

Also Read :CM Chandrababu : సీఎం చంద్రబాబు కొత్త సంప్రదాయం.. ఇక నుంచి ప్రతీ శనివారం..!

మహారాష్ట్రలోనూ నీట్-సంబంధిత అక్రమాలు బయటపడ్డాయి. ఆ రాష్ట్రానికి కూడా సీబీఐ త్వరలోనే ఒక దర్యాప్తు టీమ్‌ను పంపే అవకాశం ఉంది.  నీట్  పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రప్రభుత్వం శనివారం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేసింది. నీట్ ప్రశ్నాపత్రం మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు నీట్ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చీఫ్ సుబోధ్ కుమార్ సింగ్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. కొత్త ఎన్‌టీఏ చీఫ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను నియమించింది.

Also Read : 144 Section : మియాపూర్‌, చందానగర్‌‌లలో ఈనెల 29 వరకు 144 సెక్షన్‌.. ఎందుకు ?