Indian Spices : మనదేశానికి చెందిన సుగంధ ద్రవ్యాలపై మరో సంచలన నివేదిక బయటికి వచ్చింది. వాటి నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అనే తనిఖీ చేస్తుంటుంది. తనిఖీ చేసిన తర్వాత వాటికి ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు మంజూరు చేస్తుంది. మార్కెట్లో చాలా ఆహార ఉత్పత్తులపై మనం నిత్యం ఎఫ్ఎస్ఎస్ఏఐ లోగోను చూస్తుంటాం. అయితే ఈవిధంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ(Indian Spices) గుర్తింపు పొందుతున్న సుగంధ ద్రవ్యాలు, మసాలా ఉత్పత్తుల్లో దాదాపు 12 శాతం తగిన నాణ్యతా ప్రమాణాలతో ఉండటం లేదని పేర్కొంటూ ఓ సంచలన నివేదిక వెలువడింది.
We’re now on WhatsApp. Click to Join
అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారంతో ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం.. ఈ సంవత్సరంలో మే నుంచి జులై మధ్యకాలంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ తనిఖీ చేసిన ప్రతీ 4,054 సుగంధ ద్రవ్యాల శాంపిళ్లలో 474 తగిన నాణ్యతా ప్రమాణాలను కలిగిలేవు. ఇంతకీ నాణ్యతా ప్రమాణాలు నిరూపించుకోలేకపోయిన సుగంధ్ర ద్రవ్యాల శాంపిళ్లు ఏయే కంపెనీలకు చెందినవి ? అనేది వెల్లడించాలి రాయిటర్స్ కోరగా.. ఇప్పుడు ఆ సమాచారం అందుబాటులో లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేయడం గమనార్హం. తాము ఆయా కంపెనీలపై చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
Also Read :World War II Bomb : వరల్డ్ వార్ -2 నాటి బాంబు కలకలం.. 400 ఇళ్లు ఖాళీ
ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌కు చెందిన ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల సుగంధ ద్రవ్యాలలో ఎక్కువ మొత్తంలో పెస్టిసైడ్స్ ఉన్నాయంటూ తమ దేశంలో వాటి విక్రయాలను హాంకాంగ్ దేశం ఆపేసింది. ఈనేపథ్యంలో బ్రిటన్, న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియాలు కూడా ఆయా బ్రాండ్ల సుగంధ్ర ద్రవ్యాల ఉత్పత్తులపై నాణ్యతా తనిఖీలను పెంచాయి. ఈనేపథ్యంలోనే మే నెల నుంచి జులై నెల వరకు దేశంలోని బ్రాండెడ్ సుగంధ్ర ద్రవ్యాల కంపెనీల మసాలా ఉత్పత్తుల శాంపిళ్ల నాణ్యతను మరోసారి ఎఫ్ఎస్ఎస్ఏఐ తనిఖీ చేసింది. ఈక్రమంలోనే 474 శాంపిళ్లు నాణ్యతా ప్రమాణాల ప్రకారం లేవని వెల్లడైంది.