Site icon HashtagU Telugu

NDA 2024-July 18 : పవన్ కళ్యాణ్, అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండేలకు ఆహ్వానం.. జులై 18న ఎన్‌డీఏ కూటమి మీటింగ్

Nda 2024 July 18

Nda 2024 July 18

NDA 2024-July 18 : జులై 17, 18 తేదీల్లో కాంగ్రెస్ నేతృత్వంలో బెంగళూరు వేదికగా విపక్షాల మీటింగ్ జరగబోతోంది.. 

సరిగ్గా జులై 18న బీజేపీ కూడా నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) కూటమి మిత్రపక్షాలతో ఢిల్లీలో భేటీ కానుంది. 

ఈ ముఖ్యమైన మీటింగ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు.

ఈ మీటింగ్ కు రావాలంటూ ఇన్విటేషన్ అందుకున్న నాయకుల జాబితాలో శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్, జనసేన అధినేత  పవన్ కల్యాణ్, హిందుస్తానీ అవామ్ మోర్చా అధినేత జితన్ రామ్ మాంఝీ, ఎల్‌జేపీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కూడా ఉన్నారు. 

ఎన్‌డీఏ కూటమి పక్షాల ఈ మీటింగ్ లో పాల్గొంటామని ఇప్పటివరకు 19 పార్టీలు ప్రకటించాయి. 

శనివారం సాయంత్రం వరకైతే ఎన్‌డీఏ సమావేశానికి రావాలని తమకు ఆహ్వానం అందలేదని టీడీపీ, శిరోమణి అకాలీదళ్ వర్గాలు తెలిపాయి.

పాత, కొత్త మిత్రపక్షాలతో కలిసి 2024 కోసం  ఎన్‌డీఏ కూటమిని సిద్ధం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. 

Also read :Chandrayaan-3: చంద్రయాన్-3 అప్డేట్.. విజయవంతంగా చంద్రయాన్‌-3 కక్ష్య పెంపు..!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ మీటింగ్ కు దానికి సంబంధం లేదని తెలుస్తోంది. ఒకవేళ  పార్లమెంటు సమావేశాలతో సంబంధమే ఉంటే .. అధికారంలో లేని మిత్రపక్షాలను ఆహ్వానించకుండా ఉండేవారని అంటున్నారు.  ఇది 2024 లోక్ సభ ఎన్నికలు ఫోకస్ గా జరుగుతున్న మీటింగ్ కావడం వల్లే కొత్తగా ఎన్డీయే కూటమిలో చేరేందుకు ఆసక్తి కలిగిన పార్టీల నేతలను కూడా  ఆహ్వానిస్తున్నారని చెబుతున్నారు. విపక్షాల కూటమి మరోవైపు స్పీడ్ ను పెంచిన నేపథ్యంలో ఎన్డీయే కూటమికి(NDA 2024-July 18) కూడా సాధ్యమైనంత త్వరగా ఒక స్పష్టమైన రూపం  ఇవ్వాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోందని సమాచారం.  నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక ఈ స్థాయిలో పెద్దఎత్తున ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశం జరగడం ఇదే తొలిసారి.

Also read : Asian Games 2023: మా టార్గెట్ గోల్డ్ మెడల్ టీమిండియా కొత్త సారథి రుతురాజ్

ఈ రాష్ట్రాలలో ఈ పార్టీలు ఎన్డీయేతో .. 

విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కు చెక్ పెట్టేలా   ఆ రాష్ట్రంలోని అనేక చిన్న పార్టీలతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఈక్రమంలోనే చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ (రామ్ విలాస్), రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ నేత ఉపేంద్ర కుష్వాహా, నిషాద్ పార్టీకి చెందిన సంజయ్ నిషాద్ తో కమలదళం జట్టు కట్టనుంది. ఇక ఉత్తర ప్రదేశ్ లో అనుప్రియా పటేల్ నేతృత్వంలోని అప్నా దళ్ (సోనేలాల్), హర్యానా నుంచి జేజేపీ పార్టీ కూడా ఎన్డీయే కూటమిలో ఉంటాయి. తమిళనాడు నుంచి అన్నాడీఎంకే, తమిళ్ మానిలా కాంగ్రెస్, భారతీయ మక్కల్ కల్వి మున్నేట్ర కజగం బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి. జార్ఖండ్ నుంచి ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU), మేఘాలయ నుంచి కాన్రాడ్ సంగ్మా యొక్క NPP, నాగాలాండ్ నుంచి NDPP, సిక్కిం నుంచి SKF, జోరమ్‌తంగా నాయకత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్, అస్సాం నుంచి AGP పార్టీ నేతలు జులై 18న జరిగే ఎన్డీయే కూటమి మీటింగ్ కు హాజరు కానున్నారు.

Also read : Ragi Oats Laddu : రాగి పిండి, ఓట్స్‌తో కలిపి లడ్డు తిన్నారా? ఎలా తయారు చేయాలో తెలుసుకోండి..

నాకు ఆహ్వానం అందలేదు

ఎన్‌డీఏ కూటమి సమావేశానికి రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ  నడ్డా నుంచి ఇప్పటివరకు తనకు ఎలాంటి లేఖ రాలేదని యూపీలో బీజేపీకి మిత్రపక్షమైన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బిఎస్‌పి) అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్ చెప్పారు.

Exit mobile version