Site icon HashtagU Telugu

NCC Special Entry : ఎన్‌సీసీ చేసిన వారికి జాబ్స్.. ట్రైనింగ్‌లో ప్రతినెలా రూ.56వేలు

Ncc Special Entry Notification

NCC Special Entry : ఏదైనా డిగ్రీతో పాటు ఎన్‌సీసీ అర్హత కలిగిన వారికి గొప్ప అవకాశం. అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థులకు మంచి  ఛాన్స్. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 57వ కోర్సుకు భారత ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 76 షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టులను(Army Officer Posts) భర్తీ చేయనున్నారు. వీటిలో 70  పోస్టులను పురుషులకు కేటాయించారు. ఈ పోస్టులలో 63 జనరల్ కేటగిరీ వారికి, 7 పోస్టులను యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కేటాయించారు. మిగతా 6 పోస్టులను మహిళలకు కేటాయించారు. ఈ పోస్టులలో 5 జనరల్ కేటగిరీ వారికి, 1 పోస్టును యుద్ధ ప్రమాదాల్లో గాయపడిన ఆర్మీ సిబ్బందికి కేటాయించారు.  01.01.2025 నాటికి 19-25 సంవత్సరాల మధ్య ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.

49 వారాల శిక్షణ 

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 11న ప్రారంభమైంది. ఆగస్టు  9 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.  అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా ఎంపికయ్యే వారికి 2025 ఏప్రిల్‌లో కోర్సు(NCC Special Entry)  ప్రారంభం అవుతుంది.  ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ట్రైనింగ్ టైంలో నెలకు రూ.56,100 చెల్లిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో పోస్టింగ్ లభిస్తుంది. వీరికి 6 నెలలపాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. నిర్ణీత పేస్కేలు ప్రకారం ఇతర అలవెన్సులు ఇస్తారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Buying A Flat : ఫ్లాట్ కొంటున్నారా ? ఈ వాస్తు టిప్స్ గుర్తుంచుకోండి

Also Read :Matsya 6000 : ‘మత్స్య 6000’ మరో రికార్డు.. ప్రతి విడిభాగానికి ధ్రువీకరణ