Congress : ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. ఈ మేరకు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) ఆదివారం ప్రకటించింది. తొలి దశలో భాగంగా ఈనెల 26న బిహార్ రాజధాని పట్నాలో, 29న ఏపీలోని విజయవాడలో నిరసనలు జరపనున్నట్లు ప్రకటించింది. వీటికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ను కోరింది. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఉపసంహరించండి…లేకుంటే మా మద్దతును కోల్పోతారు అన్న సందేశాన్ని బీజేపీ మిత్ర పక్షాలకు పంపించడమే ఈ ధర్నాల ఉద్దేశమని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ప్రదర్శనలను జరుపుతామని, ముఖ్యంగా హైదరాబాద్, ముంబయి. కోల్‌కతా, బెంగళూరు, మలేర్‌కోట్లా (పంజాబ్), రాంచీల్లో భారీ ఊరేగింపులు ఉంటాయని వివరించారు. ముస్లిం బోర్డు వినతిపై ఆయా పార్టీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తిగా మారింది.
Read Also: Phone Tapping Case: విదేశీ గడ్డపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్, శ్రవణ్ ఆలోచన అదేనా ?
కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ) బిల్లును రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ పేర్కొంది. శతాబ్దాల కాలం నుంచి బలంగా ఉన్న మన దేశ బహుళ మత సమాజ సామరస్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ నిరంతరంగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారని ఆరోపించింది. వక్ఫ్ ప్రయోజనాల కోసం భూమిని ఎవరు దానం చేయవచ్చో నిర్ణయించడంపై ఉద్దేశపూర్వకంగా అస్పష్టత ఇచ్చారని, వక్ఫ్ నిర్వచనాన్నే మార్చారని రమేశ్ ఆరోపించారు. వక్ఫ్ పాలనను బలహీనం చేసేందుకు ప్రస్తుతం ఉన్నచట్టంలోని నిబంధనలు తొలగించారని, వక్ఫ్ భూములను అక్రమించిన వారికి రక్షణ కల్పించేలా మార్పులు చేశారని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులపై వివాదాలు, వాటి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అంఽశాలపై కలెక్టర్లు, నియమించిన ఇతర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు విశేష అధికారాలు కల్పించడాన్ని ఆయన తప్పుబట్టారు.
Read Also: Summer : సమ్మర్ లో మీరు చురుకుగా ఉండాలంటే ఇవి తినాలసిందే