Site icon HashtagU Telugu

MBBS Pass Marks : ఎంబీబీఎస్ పాస్ మార్కులపై ఎన్ఎంసీ వెనకడుగు.. పాత విధానానికే జై

MBBS Seats

MBBS Seats

MBBS Pass Marks :  నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్‌ కోర్సు పాస్ మార్కుల పర్సంటేజీని తగ్గిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఎంబీబీఎస్ కోర్సులోని థియరీ, ప్రాక్టికల్ లను కలిపి అగ్రిగేట్ సబ్జెక్టులు అంటారు. మొత్తం కోర్సు వ్యవధి నాలుగున్నర సంవత్సరాలు. సాధారణంగా ఎంబీబీఎస్ కోర్సు చివరలో అగ్రిగేట్ సబ్జెక్టుల్లో మొత్తంగా 50 శాతం మార్కులు వస్తేనే పాస్  అయినట్లుగా పరిగణిస్తారు.

We’re now on WhatsApp. Click to Join

అయితే గత నెల (సెప్టెంబర్‌)లో ఎంబీబీఎస్ పాస్‌ పర్సంటేజ్‌ను 40 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎన్‌ఎంసీ ప్రకటించింది.  పాస్‌ పర్సంటేజ్‌ను 40 శాతానికి తగ్గించినందుకుగానూ అందుకు అనుగుణంగా కాంపిటెన్సీ బేస్డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎంఈ) కరిక్యులమ్‌ మార్గదర్శకాలను కూడా సవరించింది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.  ఇకపై పాత విధానం ప్రకారమే ఎంబీబీఎస్ పాస్‌ పర్సంటేజ్‌ 50 శాతం ఉంటుందని తాజాగా ప్రకటించింది. దీనిపై శుక్రవారం (అక్టోబరు 6న) అధికారికంగా ఓ నోటిఫికేషన్‌ను ఎన్‌ఎంసీ (MBBS Pass Marks) విడుదల చేసింది.

Also read : Cholesterol: మంచి కొలెస్ట్రాల్ అంటే ఏంటి..? ఇది మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది..?

Exit mobile version