Namo NTR : BJP పొలిటిక‌ల్ క‌టౌట్ NTR , స్పీచ్ లో భ‌క్తిని చాటిన ప్ర‌ధాని మోడీ

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ప్ర‌స్తావ‌న వచ్చింది.

  • Written By:
  • Updated On - January 18, 2023 / 02:52 PM IST

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ప్ర‌స్తావ‌న వచ్చింది. సాక్షాత్తు ప్ర‌ధాని మోడీ స్పీచ్ స్వ‌ర్గీయ ఎన్టీఆర్( Namo NTR) కేంద్రంగా సాగింది. ప్ర‌జా క్షేత్రంలో ఆయ‌న పోరాడిన తీరును ప్ర‌స్తుతించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఎన్టీఆర్ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. ఆయ‌న త‌ర‌హాలో బీజేపీ(BJP) క్యాడ‌ర్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాల‌ని దిశానిర్దేశం చేయ‌డం ఎన్టీఆర్ గొప్ప‌త‌నాన్ని చాటుతోంది.

ప్ర‌జానాయ‌కుడు ఎన్టీఆర్ (Namo NTR)

ప్ర‌జా నాయ‌కునిగా ఎన్టీఆర్ కు పేరుంద‌ని ప్ర‌స్తావించారు. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా న‌రేంద్ర మోడీ ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన సంద‌ర్భంగానూ స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ను ప్ర‌శ‌సించారు. ఆయ‌న మీద ఉన్న గౌర‌వాన్ని చాటారు. 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా హీరో బాల‌క్రిష్ణ‌ను ప్ర‌త్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. ఇటీవ‌ల అమిత్ షా హైద‌రాబాద్ వ‌చ్చిన సంద‌ర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ తో మాట్లాడారు. వాళ్లిద్ద‌రి భేటీ మీద ఇప్ప‌టికీ ప‌లు ర‌కాల రాజ‌కీయ ఊహాగానాలు లేచాయి. రాబోవు రోజుల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ చ‌రిష్మాను దేశ వ్యాప్తంగా వాడుకోవాల‌ని బీజేపీ భావిస్తోంది. ప్ర‌త్యేకించి తెలుగు రాష్ట్రాల్లో జూనియ‌ర్ ద్వారా బీజేపీ ఫోక‌స్ కావాల‌ని చూస్తోంది. ఆ క్ర‌మంలో అమిత్ షా ప్ర‌త్యేకంగా జూనియ‌ర్ తో అరగంట పాటు ఇటీవ‌ల మాట్లాడారు.

Also Read : NTR : నెర‌వేర‌ని ఎన్టీఆర్ క‌ల‌ ‘భారతదేశం’, ఆ దిశ‌గా కేసీఆర్ బీఆర్ఎస్ !

స‌మీప భ‌విష్య‌త్ లో జ‌ర‌గున్న‌ అసెంబ్లీ ఎన్నికలకు దిశానిర్ధేశం ఇచ్చే జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఎన్టీఆర్ పేరును మోడీ ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు (ఎన్టీఆర్)ను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలను ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజలతో బలమైన అనుబంధం కోసం ఎన్టీఆర్‌ను మోడీ “ప్రజా నాయకుడు”గా అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలకే 1983 ఎన్నికలలో విజయం సాధించారు. ఇది తెలంగాణ బీజేపీకి స్ఫూర్తిగా నిలవాలి’’ అని మోదీ రాష్ట్ర నేతలకు సూచించ‌డం బీజేపీ భ‌విష్య‌త్ రాజ‌కీయాన్ని చాటుతోంది.

ఎన్టీఆర్ స్ఫూర్తిగా మోడీ (BJP)

ఎన్టీఆర్ కృషి టీడీపీ విజయానికి ఎలా దారితీసిందో కూడా మోడీ హైలైట్ చేశారు. తెలంగాణ బీజేపీ(BJP) నాయకులు ఎన్నికల యుద్ధంలో ఎన్టీఆర్ త‌ర‌హాలో సంకల్పం బ‌లం, ఉత్సాహంతో పోరాడాలని వెన్నుత‌ట్టారు. ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణపైనే పార్టీ అధినాయకత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగం ఎక్కువ భాగం తెలంగాణ చుట్టూ తిరిగింది. గుజరాత్ మీద ఎలా క‌న్నేశారో, ఆ విధంగా తెలంగాణ‌లోనూ చేయాల‌ని ప్రధాని వ్యాఖ్యల ద్వారా అర్థ‌మ‌వుతోంది.

మ‌రో వెంక‌య్య‌నాయుడు బండి (BJP)

ఒక వైపు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ను ప్ర‌శ్నిస్తూ మాజీ రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడుతో పోల్చారు. తెలుగు భాష‌ను అద్భుతంగా మాట్లాడే వెంక‌య్య‌నాయుడుతో సంజ‌య్ ను పోల్చ‌డం తెలుగువాళ్ల‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించింది. మ‌రో వెంక‌య్య‌నాయుడు తెలుగు రాష్ట్రాల్లో క‌నిపిస్తున్నార‌ని సంజ‌య్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న చేసిన ప్ర‌జా సంగ్రామ యాత్ర‌ను మోడల్ గా తీసుకోవాల‌ని మిగిలిన రాష్ట్రాల చీఫ్ ల‌కు దిశానిర్దేశం చేశారు. ఆ సంద‌ర్భంగా స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పేరును ప్ర‌స్తావిస్తూ ఆయ‌న పోరాట‌ప‌టిమ‌ను గుర్తు చేశారు.

Also Read : Jr.NTR and Kalyan Ram: నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళి