Rahul Gandhis Assets : రాహుల్ గాంధీకి ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా ?

Rahul Gandhis Assets : కేరళలోని వయనాడ్ నుంచి రెండోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలలో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు.

Published By: HashtagU Telugu Desk
Rahul Gandhis Assets

Rahul Gandhis Assets

Rahul Gandhis Assets : కేరళలోని వయనాడ్ నుంచి రెండోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలలో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.20.25 కోట్ల వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇందులో రూ.9.25 కోట్లు విలువైన చరాస్తులు, రూ.11 కోట్లు విలువైన స్థిరాస్తి ఉన్నాయని తెలిపారు. తన స్థిరాస్తుల్లో  వ్యవసాయ భూమి, వాణిజ్య భవనాలు ఉన్నాయని నామినేషన్ పత్రాల్లో ప్రస్తావించారు. 2019 లోక్‌సభ ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తన ఆస్తుల విలువ రూ.14 కోట్లు అని తెలిపారు. ఇప్పుడు ఆ ఆస్తులు కాస్తా గణనీయంగా పెరిగి రూ.20 కోట్లు దాటాయి. అంటే రాహుల్ ఆస్తులు దాదాపు 28 శాతం మేర పెరిగాయన్న మాట. కాగా,  తనపై 18 పెండింగ్ కేసులు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత(Rahul Gandhis Assets) చెప్పారు. వీటిలో ఎక్కువగా పరువు నష్టం దావా కేసులే ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

రాహుల్ ఆస్తుల లెక్కలివీ.. 

  • 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాహుల్ గాంధీ మొత్తం ఆదాయం రూ.1,02,78,680.
  • 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాహుల్ గాంధీ మొత్తం ఆదాయం రూ.1,31,04,970.
  • రాహుల్ పేరిట రెండు కార్యాలయ స్థలాలు (B-007, B-008) హరియాణాలోని గురుగ్రామ్‌  పరిధి సిలోఖేరా గ్రామంలో ఉన్న సిగ్నేచర్ టవర్స్‌లో ఉన్నాయి. వీటిని రూ.7 కోట్ల, రూ. 93 లక్షల ధరతో కొనగా, ప్రస్తుతం ఈ స్థలాల మొత్తం ధర రూ.9 కోట్ల వరకు పెరిగింది.
  • తనకు ఎంపీగా వేతనం, అద్దెలు, బ్యాంకు వడ్డీ, బాండ్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు నుంచి ఆదాయం వచ్చినట్టు రాహుల్ గాంధీ తెలిపారు.

Also Read :Jaya Prada Desire : ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. బీజేపీ పెద్దల నిర్ణయమే ఫైనల్ : జయప్రద

  • తన చేతిలో రూ. 55 వేల నగదు ఉందని రాహుల్ తెలిపారు.
  • తన బ్యాంకు ఖాతాల్లో రూ. 26,25,157 డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు.
  • తనకు  రూ.3,81,33,572 మ్యూచవల్ ఫండ్ పెట్టుబడులు ఉన్నాయన్నారు.
  • రూ. 1,52,147 విలువైన సావరిన్ గోల్డ్ బాండ్లు తన పేరిట ఉన్నాయని రాహుల్ వెల్లడించారు.
  • రాహుల్ వద్ద వివిధ కంపెనీలకు చెందిన రూ. 4,33,60,519 విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి.

Also Read : Messages Via Satellite : ఇక సిగ్నల్స్ లేకున్నా మెసేజ్ పంపొచ్చు.. ఎలా ?

  Last Updated: 04 Apr 2024, 09:33 AM IST