Mumbai Terror Attacks :ఉగ్రవాది తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగించే దిశగా అమెరికా కసరత్తును ముమ్మరం చేసింది. త్వరలోనే అతడు భారత్‌కు చేరే అవకాశం ఉంది. మన దేశ వాణిజ్య రాజధాని ముంబైపై 2008 సంవత్సరం నవంబరు 26న జరిగిన 26/11 ఉగ్రదాడికి సూత్రధారి తహవ్వుర్ రాణాయే. అతడు మన దేశానికి చేరితే.. వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), భారత నిఘా విభాగం రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) రంగంలోకి దిగి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఉగ్రదాడిలో పాకిిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల పాత్రపై రాణా నోటి నుంచి నిజాలను కక్కించేందుకు లైన్ క్లియర్ అవుతుంది. అదే జరిగితే.. 26/11 ఉగ్రదాడిలో రక్తం పారించిన ఉగ్ర రాక్షసుడు అజ్మల్ కసబ్ తరహాలో తహవ్వుర్ రాణాకు కూడా కఠిన శిక్ష పడే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
Also Read :Kejriwal Vs BJP : ‘‘బీజేపీ తప్పుడు చర్యలను సమర్ధిస్తారా ?’’.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ లేఖ
అమెరికాతో భారత్‌కు నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ఉంది. ఆ ఒప్పందంలో భాగంగా.. 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగించొచ్చని పేర్కొంటూ ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని ఓ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఉగ్రదాడిలో రాణా పాత్రను నిరూపించే పలు ఆధారాలను కూడా భారత్ ఇప్పటికే ఇచ్చిందని అప్పట్లో న్యాయస్థానం పేర్కొంది. తహవ్వుర్ రాణాకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలను అమెరికాకు ఇవ్వడాన్ని బట్టి ఈ కేసును భారత్ ఎంత సీరియస్‌గా తీసుకుంటోందో మనం అర్థం చేసుకోవచ్చు.
Also Read :Condoms Sales : డిసెంబరు 31న బిర్యానీతో పోటీపడి కండోమ్ సేల్స్
తహవ్వుర్ రాణా ఏం చేశాడంటే..
నేరగాళ్ల అప్పగింత ఒప్పందంలో మరో కీలకమైన అంశం ఉంది. అదేమిటంటే.. ఈ ఒప్పందం ద్వారా అప్పగించే వ్యక్తి విషయంలో ఒకే నేరానికి రెండుచోట్ల శిక్షలు అనుభవించాలని తీర్పులు ఇవ్వకూడదు. 26/11 దాడులకు ముందు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో పర్యటించి రెక్కీ నిర్వహించాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ముంబైపై ఉగ్రదాడి కోసం తహవ్వుర్ రాణా ప్లాన్‌ను రెడీ చేసి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తైబాకు అందించాడు. ముంబైపై ఉగ్రదాడి జరిగిన ఏడాది తర్వాత అమెరికాలోని చికాగోలో ఎఫ్‌బీఐ అధికారులు తహవ్వుర్ రాణాను(Mumbai Terror Attacks) అదుపులోకి తీసుకొన్నారు.ముంబై ఉగ్రదాడికి సంబంధించి తహవ్వుర్ రాణాపై ముంబై పోలీసులు 405 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తైబాలతో రాణాకు లింకులు ఉన్నాయని ఆరోపించారు.