Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

Bomb Threat : దేశ ఆర్థిక రాజధాని ముంబయి మరోసారి ఉగ్ర బెదిరింపులతో కాసేపు ఉలిక్కిపడింది. నగరంలో భారీ ఉగ్రదాడులు జరగనున్నాయంటూ శుక్రవారం ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు ఒక ఇమెయిల్‌ రావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Bomb Threat

Bomb Threat

Bomb Threat : దేశ ఆర్థిక రాజధాని ముంబయి మరోసారి ఉగ్ర బెదిరింపులతో కాసేపు ఉలిక్కిపడింది. నగరంలో భారీ ఉగ్రదాడులు జరగనున్నాయంటూ శుక్రవారం ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు ఒక ఇమెయిల్‌ రావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ బెదిరింపు మెయిల్‌ వెనుక ఎవరున్నారు? ఉగ్రవాద సంబంధాలున్నాయా? అన్న అనుమానాలతో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అయితే కొద్ది గంటల్లోనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు చేసిన సాంకేతిక దర్యాప్తులో ఆ ఇమెయిల్‌ను పంపింది బిహార్‌కు చెందిన అశ్వినీ కుమార్‌ అని గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ప్రాథమిక విచారణలో అతడు ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధం లేకుండా, వ్యక్తిగత విభేదాల కారణంగానే ఈ సాహసానికి పాల్పడ్డాడని తేలింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కొన్ని సంవత్సరాల క్రితం అశ్వినీ కుమార్‌, అతని స్నేహితుడు ఫిరోజ్‌ మధ్య ఓ వివాదం తలెత్తింది. ఆ వివాదంలో భాగంగా ఫిరోజ్‌ అతనిపై కేసు పెట్టడంతో అశ్వినీ జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఈ సంఘటనతో అతడు ఫిరోజ్‌పై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. తాజాగా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఫిరోజ్‌ను ఉగ్రవాద కేసులో ఇరికించాలనే దురుద్దేశంతో ఆ బెదిరింపు మెయిల్‌ను ఫిరోజ్‌ పేరుతో పంపించాడు.

GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

ఇమెయిల్‌ వచ్చిన వెంటనే ముంబయి పోలీసులలో క్షణాల్లో అలర్ట్‌ సైరన్లు మోగాయి. ఎక్కడైనా బాంబులు పెట్టారా? ఎలాంటి దాడులు జరుగుతాయా? అన్న అనుమానాలతో దాదాపు అన్ని ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్లు, డాగ్‌ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. కానీ పరిశీలనలో ఎక్కడా అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. దాంతో ఇది కేవలం ఫేక్‌ బెదిరింపు మెయిల్‌ అని పోలీసులు నిర్ధారించారు.

ముంబయి వంటి మహానగరానికి తప్పుడు ఉగ్ర బెదిరింపులు రావడం సాధారణం కాదు. ప్రతి మెయిల్‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తారు. ఈ తరహా అబద్ధపు సమాచారం పంపేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అశ్వినీ కుమార్‌పై కూడా తీవ్ర నేర కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబయి వంటి మహానగరంలో ఎంత క్షణాల్లో అలజడి రేపుతుందో మరోసారి చాటిచెప్పింది. ఉగ్రదాడుల ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రతి ఇలాంటి సమాచారం విశ్వసనీయంగానే పరిగణించి చర్యలు చేపట్టడం తప్పదని అధికారులు చెబుతున్నారు. ఒకరి వ్యక్తిగత కక్ష కోసం మొత్తం నగరాన్ని ఉలిక్కిపడేలా చేయడం తీవ్ర నేరమని, ఇలాంటి వారికి తగిన శిక్ష తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  Last Updated: 06 Sep 2025, 09:58 AM IST