Site icon HashtagU Telugu

Mukesh Ambani: మరో రంగంలోకి ముఖేష్ అంబానీ గ్రాండ్ ఎంట్రీ

Mukesh Ambani

Mukesh Ambani

బిలియనీర్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఏ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినా సంచలనమే. ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్న మరో కొత్త బిజినెస్ జెనెటిక్ మ్యాపింగ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన Strand Life Sciences ఒక కొత్త ప్రోడక్ట్ ను అభివృద్ధి చేసింది. జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే కిట్ ను కేవలం రూ.12 వేలకు మార్కెట్లోకి తెచ్చేందుకు రెడీ అయింది. ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్న జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే కిట్ల కంటే ఈ ధర 86 శాతం తక్కువ. ఈ కిట్ ద్వారా జీనోమ్ టెస్ట్ చేసుకుంటే క్యాన్సర్, గుండె జబ్బులు, న్యూరో వ్యాధులు, వారసత్వంగా వచ్చే ఆరోగ్య సమస్యలు నిర్ధారణ అవుతాయి. చాలా చౌకగా దేశ ప్రజలందరి జీనోమ్ హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించడానికి ఈ చౌక్ జీనోమ్ సీక్వెన్సింగ్ కిట్ ఉపయోగ పడుతుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికైతే కొన్ని చైనా కంపెనీలు కేవలం రూ.7500కే జీనోమ్ సీక్వెన్సింగ్ కిట్స్ అమ్ముతున్నాయి. అయితే వాటి ద్వారా అన్ని రకాల వ్యాధుల నిర్ధారణ జరగదు. ముఖేష్ అంబానీ (Mukesh Ambani) తీసుకొచ్చే కిట్ మాత్రం చాలా వ్యాధులను కవర్ చేయగలదు. ఈ కిట్ ను MyIioApp, Reliance Jio Infocomm, Jio Health Hub, Netmeds లలో ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బ్లడ్ శాంపిల్ సేకరించి ఈ కిట్ ద్వారా టెస్ట్ చేసి రిపోర్ట్ ఇస్తారు.

23 and Me స్టార్టప్ మాదిరిగా..

బెంగళూరుకు చెందిన Strand Life Sciences సంస్థలో దాదాపు 80 శాతం వాటాలను రిలయన్స్ గ్రూప్ 2021లోనే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  అమెరికాలోని 23andMe స్టార్టప్ మాదిరిగా తక్కువ ఖర్చుతో భారతీయు లందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఇంకా    Mapmy Genome, Medgenome వంటి భారతీయ కంపెనీల పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ 1,000డాలర్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో  తక్కువ ధరలో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన అంబానీ తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read:  Sleep Tourism: స్లీప్ టూరిజం పిలుస్తోంది..