Life Threat: అంబానీ, అమితాబ్ కు ప్రాణహాని.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపు

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), నటుడు ధర్మేంద్ర, దేశంలోని బడా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ (Mukesh Ambani) సహా పలువురు ప్రముఖుల ఇళ్లను బాంబులతో పేల్చివేస్తానని మంగళవారం నాగ్‌పూర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు.

  • Written By:
  • Publish Date - March 1, 2023 / 12:31 PM IST

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), నటుడు ధర్మేంద్ర, దేశంలోని బడా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ (Mukesh Ambani) సహా పలువురు ప్రముఖుల ఇళ్లను బాంబులతో పేల్చివేస్తానని మంగళవారం నాగ్‌పూర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ తర్వాత ఆందోళన నెలకొంది. నాగ్ పూర్ పోలీసులు ఈ విషయాన్ని ముంబై పోలీసులకు సమాచారం అందించారు.

గుర్తు తెలియని వ్యక్తి బెదిరించిన ప్రదేశాలకు బాంబు స్క్వాడ్ చేరుకుని సోదాలు ప్రారంభించింది. ఇది కాకుండా, 25 మంది ఉగ్రవాదులు దాదర్‌కు చేరుకున్నారని, వారు దాడికి ప్లాన్ చేస్తున్నారని కూడా కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ తర్వాత నాగ్‌పూర్ పోలీసులు ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. మంగళవారం కాల్ రావడంతో పోలీసులు కాలర్ చెప్పిన స్థలాలను తనిఖీ చేశారు. కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు. ముఖేష్ అంబానీకి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు 2022 ఆగస్టు నెలలో బెదిరింపు కాల్ వచ్చింది.

Also Read: Onions: ఫిలిప్పీన్స్‌లో కన్నీళ్ళు పెట్టిస్తున్న ఉల్లి ధర..!

ముంబైలో బాంబు పేలుళ్లు చేస్తామని ఇంతకు ముందు చాలాసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ముంబై పోలీసులు మాత్రం ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ముకేశ్ అంబానీకి Z+ భద్రత

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముకేశ్‌ అంబానీ, అతని కుటుంబసభ్యులకు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అత్యున్నత Z+ భద్రత కల్పించాలని సుప్రీం ఆదేశించింది. కాగా ముకేశ్‌ అంబానీకి అత్యున్నతస్థాయి Z+ సెక్యూరిటీని అందించడానికి అయ్యే మొత్తం ఖర్చులు అంబానీనే భరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.