Site icon HashtagU Telugu

MS Dhoni : జార్ఖండ్ అసెంబ్లీ పోల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ

Ms Dhoni Jharkhand Elections Brand Ambassador

MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ..  కేంద్ర ఎన్నికల సంఘం తరఫున జార్ఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులు అయ్యారు. జార్ఖండ్‌లోని  43 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబరు 13న తొలి దశ పోలింగ్ జరగనుంది. ఈసందర్భంగా ఎన్నికల సంఘం ఓటు విలువపై, పోలింగ్ శాతాన్ని పెంచడంపై ముమ్మర ప్రచారం చేయనుంది. ఇందుకోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఫొటోను వాడుకోనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ధోనీ అనుమతించారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె రవికుమార్ వెల్లడించారు. జార్ఖండ్‌లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి, సాధ్యమైనంత ఎక్కువ మంది ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు ఆకర్షించేందుకు మహేంద్ర సింగ్ ధోని తనవంతుగా  కృషి చేస్తారని ఆయన తెలిపారు. సిస్టమ్యాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఓటు విలువ గురించి తెలియజేసే దిశగా ధోనీ ప్రచారం ఉంటుందన్నారు. ధోనీ వల్ల ఈసారి జార్ఖండ్‌లో పోలింగ్ శాతం పెరుగుతుందని  చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె రవికుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read :BluJ Aerospace : విమానం నిలువునా నింగిలోకి, నేలపైకి.. హైదరాబాద్ స్టార్టప్ తడాఖా

Also Read :Chinese Troops : దెప్సాంగ్, డెమ్‌చోక్‌ నుంచి చైనా బ్యాక్.. శాటిలైట్ ఫొటోలివీ