ED Director Mishra : ఆయ‌న కోసం ఆర్డినెన్స్..

వ‌డ్చించే వాడు మ‌న‌వాడైతే...ఎక్క‌డ కూర్చున్నా అన్నీ అందుతాయ‌ని పెద్ద‌ల సామెత‌. ఇప్పుడు ఈడీ డైరెక్ట‌ర్ మిశ్రా ( ED Director Mishra ) విష‌యంలోనూ అదే జరుగుతోంది.

  • Written By:
  • Updated On - November 15, 2021 / 02:07 PM IST

వ‌డ్చించే వాడు మ‌న‌వాడైతే…ఎక్క‌డ కూర్చున్నా అన్నీ అందుతాయ‌ని పెద్ద‌ల సామెత‌. ఇప్పుడు ఈడీ డైరెక్ట‌ర్ మిశ్రా ( ED Director Mishra ) విష‌యంలోనూ అదే జరుగుతోంది. ప్ర‌భుత్వానికి అడుగులు మ‌డుగులొత్తాతార‌ని ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. మ‌రో వారం రోజుల్లో ఆయ‌న ప‌ద‌వీ విమ‌ర‌ణ చేయాలి. ఆ లోపుగా సీబీఐ, ఈడీ అధిప‌తుల ప‌ద‌వీకాలం పొడ‌గిస్తూ కేంద్రం ఏకంగా ఆర్డినెన్స్ ను. తీసుకొచ్చింది. ఇదంతా మిశ్రా కోసంమేన‌ని విప‌క్షాల ఆరోప‌ణ‌.ఈడీ డైరెక్టర్‌ ఎస్‌కే మిశ్ర పదవీకాలం పొడిగింపు విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసాధారణ, అరుదైన సందర్భాల్లో మాత్రమే పదవీ కాలాన్ని పొడిగించాలని పేర్కొంది. వచ్చే వారం ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తికావొస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ ఆర్డినెన్సులు తీసుకురావడం గమనార్హం.దర్యాప్తు సంస్థ‌లపై రాజ‌కీయ ప్ర‌మేయం పెరుగుతోంద‌ని ఇటీవ‌ల వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు అనేకం. వాటికి బ‌లం చేకూరేలా తాజాగా సీబీఐ, ఈడీ అధిప‌తుల‌కు కేంద్రం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. ఆ మేర‌కు రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ఫైల్ ను క్లియ‌ర్ చేశారు. ఆదేశాల ప్ర‌కారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌రువాత ఐదేళ్లు కొన‌సాగ‌వ‌చ్చ‌న్న‌మాట‌.

Also Read : దక్షిణ భారత సహకారం లేకుండా దేశ అభివృద్ధిని ఊహించలేం: అమిత్ షా

ప్ర‌స్తుతం ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌రువాత రెండేళ్ల పాటు కొన‌సాగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డానికి అవకాశం ఉంది. తాజాగా ఇచ్చిన వెసుల‌బాటు ప్ర‌కారం రెండేళ్లు పూర్త‌యిన త‌రువాత ఏడాది చొప్పున మ‌రో మూడేళ్లు అధిప‌తుల‌ను కొన‌సాగించ‌వ‌చ్చు. అంటే, ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉంటే ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌రువాత కూడా మొత్తంగా ఐదేళ్ల పాటు ప‌దవిలో ఉండేలా వెసుల‌బాటు ఇచ్చేశారు.ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌రువాత కూడా విధుల్లో కొన‌సాగే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధిపతుల పదవీ కాలం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.వారి పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ కేంద్రం రెండు వేర్వేరు ఆర్డినెన్సులను తీసుకొచ్చింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ మేరకు ఆర్డినెన్సులపై సంతకం చేశారు. ప్రస్తుతం సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలం రెండేళ్లు ఉన్న విష‌యం విదిత‌మే.ఐదేళ్ల తర్వాత పొడిగించడానికి ఎలాంటి అవకాశం ఉండదు.