Manipur: మణిపూర్‌లో హింసాకాండ.. 1100 మందికి పైగా అస్సాంకు వలస..!

మణిపూర్‌ (Manipur)లో హింసాకాండ కారణంగా రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళ్తున్నారు. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల నుండి 1100 మందికి పైగా (More Than 1100) అస్సాం (Assam)లోని చాచార్ జిల్లాకు చేరుకోవడానికి సరిహద్దులు దాటారు.

  • Written By:
  • Publish Date - May 6, 2023 / 01:49 PM IST

మణిపూర్‌ (Manipur)లో హింసాకాండ కారణంగా రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళ్తున్నారు. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల నుండి 1100 మందికి పైగా (More Than 1100) అస్సాం (Assam)లోని చాచార్ జిల్లాకు చేరుకోవడానికి సరిహద్దులు దాటారు. వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది మణిపూర్‌లోని కుకీ కమ్యూనిటీకి చెందినవారు. ఈ ప్రజలు తమ ఇళ్లపై దాడి చేస్తారని భయపడుతున్నారు. వాస్తవానికి, గురువారం రాత్రి కొందరు వ్యక్తులు బాధితుల ఇంటిపై దాడి చేశారు. ఆ తర్వాత కుకీ వర్గానికి చెందిన ప్రజలు భయంతో అస్సాం చేరుకున్నారు.

దాడి తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయారు

దాడి తర్వాత అస్సాం చేరుకున్న వ్యక్తులు మాట్లాడుతూ.. గురువారం రాత్రి 10 గంటల సమయంలో తమకు శబ్దం వినిపించిందని, ఆ తర్వాత తమపై దాడి జరుగుతున్నట్లు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాళ్లు రువ్వి మమ్మల్ని బెదిరించారు. అస్సాం చేరుకున్న వైకీ ఖోంగ్‌సాయి అనే 24 ఏళ్ల యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటిని విడిచిపెట్టినట్లు చెప్పింది. గురువారం ఉదయం మైతీ, కుకీ వర్గాల మధ్య శాంతి చర్చలు జరిగాయని, ఇరు వర్గాలు ఒకరికొకరు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని వైకీ తెలిపారు. అయితే రాత్రికి అది తప్పుడు ఒప్పందమని తెలిసిందన్నారు.

Also Read: ALH Dhruv Chopper: మరోసారి ALH ధ్రువ్ హెలికాప్టర్ కార్యకలాపాలను నిలిపివేసిన అధికారులు

పరిస్థితిని అదుపు చేసేందుకు సైన్యం ప్రయత్నిస్తోంది

పరిస్థితిని అదుపు చేసేందుకు సైన్యం ప్రయత్నిస్తోందని, అయితే ఇప్పటికీ భయానక వాతావరణం ఉందని, అందుకే తాను కొంతకాలంగా తన ఇంటిని వదిలి అస్సాం చేరుకున్నానని ఖోంగ్‌సాయి చెప్పారు. సైన్యం ఉన్నంత కాలం మనం క్షేమంగా ఉన్నామని, అయితే సైన్యం మనల్ని ఎల్లవేళలా కాపాడుతుందని చెప్పలేమని అన్నారు. అస్సాం సరిహద్దు దాటి అర్ధరాత్రి ఇక్కడికి చేరుకోవడానికి కారణం ఇదే అన్నారు.

అస్సాంలో క్యాంపులు ఏర్పాటు

మరోవైపు అస్సాం డిప్యూటీ కమిషనర్ రోహన్ కుమార్ ఝా శుక్రవారం సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సౌకర్యార్థం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మణిపూర్ నుంచి అస్సాం చేరుకున్న కొందరు బంధువుల ఇళ్లలో ఉంటున్నారు. మరికొందరు వివిధ శిబిరాల్లో తలదాచుకున్నారు. వివిధ ప్రాథమిక పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో ఈ శిబిరాలు నిర్వహించారు. నిర్వాసితులకు రేషన్‌ అందించారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని చచార్ ఎస్పీ నుముల్ మహతో తెలిపారు. అస్సాంలోని రెండు జిల్లాలైన చచార్, దిమా హసావో మణిపూర్‌తో 200 కి.మీ పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి.