Site icon HashtagU Telugu

Jammu Kashmir LG : కశ్మీర్ ఎల్జీకి మరిన్ని అధికారాలు.. పునర్వ్యవస్థీకరణ చట్టంలో కీలక సవరణలు

Jammu Kashmir Lg Powers

Jammu Kashmir LG : త్వరలోనే జమ్ముకశ్మీర్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారాలను పెంచుతున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈమేరకు గతంలో మోడీ సర్కారు తీసుకొచ్చిన ‘‘జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2019’’లోని సెక్షన్ 55లో సవరణలు చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ కొత్త అధికారాల్లో భాగంగా.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారులను బదిలీ చేసే అధికారం లభిస్తుంది. అధికారులకు పోస్టింగుల చేసే హక్కు కూడా వారికి దక్కుతుంది. ఈమేరకు కేంద్ర హోంశాఖ ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

తాజా మార్పుల ప్రకారం..  కశ్మీర్‌లోని పోలీసు, పబ్లిక్ ఆర్డర్‌‌కు సంబంధించిన విషయాలలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు(Jammu Kashmir LG) అదనపు అధికారాలను కట్టబెట్టారు.  అంటే వారు పనిచేసే పరిధి మరింత పెరిగింది. కశ్మీర్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ఆల్ ఇండియా సర్వీస్, యాంటీ కరప్షన్ బ్యూరోకు సంబంధించిన ప్రతిపాదనలపై నిర్ణయాలు తీసుకునే హక్కు లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగించారు. త్వరలోనే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ప్రకటించాలని కేంద్ర సర్కారు(Home Ministry) భావిస్తోంది. ఈక్రమంలోనే ఈ సవరణలు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ పోల్స్ తర్వాత కశ్మీర్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వంపై కేంద్ర సర్కారుకు పట్టు ఉండేలా ఈ సవరణలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. పోలీసులు, పబ్లిక్ ఆర్డర్, యాంటీ కరప్షన్ బ్యూరోలు కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలోకి వెళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఈ కీలకమైన విభాగాలను ఉంచినప్పటికీ.. వాటిపై ఆజమాయిషీ మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్‌కే దక్కేలా చేశారు.  కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఇప్పుడు వ్యూహాత్మకంగా ఈ సవరణలు చేసిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Also Read :Trainee IASs Mother: తుపాకీతో రైతులను బెదిరించిన ట్రైనీ ఐఏఎస్ తల్లి.. కేసు నమోదు

దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన జూన్‌ 25వ తేదీని ఇక నుంచి రాజ్యాంగ ‘హత్యాదినం’‌గా నిర్వహిస్తామని శుక్రవారం రోజు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన గెజిట్​‌ను నిన్ననే విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. 1975 జూన్‌ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించటం ద్వారా తన నియంతృత్వ ధోరణిని ప్రదర్శించటమే కాకుండా ప్రజాస్వామ్య ఆత్మను ఉరితీశారని ఆయన విమర్శించారు. ఏ తప్పూ చేయకపోయినా లక్షలాది మందిని జైళ్లలోకి తోశారని, మీడియాపై ఆంక్షలు విధించారని ధ్వజమెత్తారు.