Site icon HashtagU Telugu

Maharashtra Assembly Elections 2024 : మోడీని ఆ మాటలతో అవమానించారు – పవన్ కళ్యాణ్

Pawan Pune

Pawan Pune

మహారాష్ట్ర ఎన్నికల (Maharashtra Assembly Elections 2024) నేపథ్యంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రెండు రోజులుగా మహారాష్ట్రలో బిజెపి అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తూ వచ్చారు. ఇక పవన్ తన ప్రసంగాలలో మరోసారి మోడీ (PM Modi) పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి చోట మోడీ పై ప్రశంసలు , సనాతన ధర్మం, బిజెపి చేస్తున్న అభివృద్ధి వంటి విషయాలనే ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక నిన్నపుణే కంటోన్మెంట్ బహిరంగ సభ (Pune Cantonment public meeting ) లో మాత్రం మోడీ ఎదురుకున్న అవమానాల గురించి ప్రస్తావించారు. మోడీ టీ అమ్ముకునే వాడు ప్రధాని అవ్వడమేంటని మోడీని కొందరు అవహేళన చేశారని , కొట్టు పెట్టి ఇస్తాం వచ్చి టీ అమ్ముకో అని అవమానించారని, అవన్నీ తట్టుకుని ఆయన 3 సార్లు ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. మోడీ మళ్లీ పీఎం అవ్వకూడదని విపక్షాలు ప్రయత్నాలు చేస్తుంటే తాను పట్టుబట్టి ఆంధ్రప్రదేశ్ లో BJP, TDPతో కూటమిగా పోటీ చేసి 93% స్ట్రైకింగ్ రేట్తో విజయం సాధించామని తెలిపారు.

అలాగే చంద్రాపూర్‌ జిల్లా పరిధిలోని బల్లార్‌పూర్‌, చంద్రాపూర్‌ నియోజకవర్గాల్లో భారీ ర్యాలీ, బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. బల్లార్‌పూర్‌ మినీ భారతదేశంలాంటిదని, ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, రకరకాల భాషలు మాట్లాడే ప్రజలు కలిసికట్టుగా ఉంటారన్నారు. మన బతుకమ్మ, మన సమ్మక్క సారక్క జాతరను ఈ నేలపై జరుపుకొంటారని గుర్తుచేశారు. కానీ హైదరాబాద్‌ పాతబస్తీ నుంచి వచ్చిన కొందరు సమ్మక్క సారక్కను, బతుకమ్మను అపహాస్యం చేస్తున్నారని.. భారతీయ సంస్కృతిని, పండుగలను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. సనాతన ధర్మాన్ని అగౌరవపరిచేవారికి.. ఆ ధర్మాన్ని అవలంబించేవారు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అన్ని మతాలను సమానంగా చూసే సనాతన ధర్మంపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోనని.. కచ్చితంగా బయటకు వచ్చి తన వంతు పోరాటం చేస్తానని ప్రకటించారు. జనసేన ఏర్పాటు వెనుక మహారాష్ట్రకు చెందిన మహానీయుల స్ఫూర్తి ఉందని.. తనకు స్ఫూర్తినిచ్చిన వారిలో ఛత్రపతి శివాజీ, బాలాసాహెబ్‌ ఠాక్రే ఉన్నారని తెలిపారు.

Read Also : Hydra Demolition : అమీన్​పూర్​లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా