Modi Tour : ప్ర‌ధాని మోడీ రికార్డ్‌, 36గంట‌ల్లో 5000km జ‌ర్నీ

ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోడీ(Modi Tour) రికార్డ్ ల‌ను క్రియేట్ చేస్తుంటారు.

  • Written By:
  • Updated On - April 22, 2023 / 05:43 PM IST

ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోడీ(Modi Tour) రికార్డ్ ల‌ను క్రియేట్ చేస్తుంటారు. అందుకే, ఆయ‌న గ్లోబ‌ల్ లీడ‌ర్ గా ఎప్పుడూ టాప్ లో ఉంటారు. తాజా 36 గంట‌ల్లో 5వేల కిలోమీటర్లు ప్ర‌యాణం(Journey) చేయ‌నున్నారు. రెండో రోజుల వ్య‌వ‌ధిలో ఎనిమిది కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఏడు వేర్వేరు న‌గ‌రాల్లో ప‌ర్య‌టిస్తారు. ఇదో రికార్డ్ గా పీఎంవో చెబుతోంది.

ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోడీ రికార్డ్(Modi Tour)

ప్రధాని న‌రేంద్ర మోదీ (Modi Tour) ఏప్రిల్ 24న ఢిల్లీలో బ‌య‌లు దేర‌తారు. వ‌రుస‌గా 36 గంటల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 5,000 కిలోమీటర్లకు పైగా రెండు రోజుల పర్యటన(Journey) చేస్తారు. ఆ సమయంలో ఎనిమిది కార్యక్రమాలకు హాజరవుతారు. ఏప్రిల్ 24న దేశ రాజధాని నుంచి ప్రారంభమయ్యే ప్రధాని మోడీ మధ్యప్రదేశ్‌కు వెళతారు. అక్క‌డ నుంచి ఆయన దక్షిణాదిలోని కేరళకు వెళతారు. ఆ రాష్ట్రంలోని కార్య‌క్ర‌మాల‌ను ముగించుకుని పశ్చిమ ప్రాంతంలోని కేంద్ర పాలిత ప్రాంతానికి వెళ్లి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.

36 గంట‌ల్లో 5వేల కిలోమీటర్లు ప్ర‌యాణం

ప్రధాని (Modi Tour) సుదీర్ఘ పర్యటన వివరాలను వివరిస్తూ “ప్రధానమంత్రి ఏప్రిల్ 24 ఉదయం ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఢిల్లీ నుండి ఖజురహో వరకు దాదాపు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఖజురహో నుండి రేవా వెళ‌తారు. అక్క‌డ‌ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత, అతను తిరిగి ఖజురహోకు వస్తారు. దాదాపు 280 కి.మీ. యువ కాన్‌క్లేవ్‌లో పాల్గొనేందుకు దాదాపు 1700 కిలోమీటర్ల వైమానిక దూరం ప్ర‌యాణిస్తారు.

బిజీ షెడ్యూల్‌లో ప్రధాని దాదాపు 5,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా బ్లూ ప్రింట్

మరుసటి రోజు ఉదయం కొచ్చి నుండి తిరువనంతపురం వరకు 190 కి.మీ.ల దూరం ప్రయాణిస్తారు. అక్క‌డ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించ‌డంతో పాటు వివిధ ప్రాజెక్టులను అంకితం చేస్తారు. మ‌రికొన్ని ప్రాజెక్టుల‌కు శంకుస్థాపన చేస్తారు. అక్క‌డ నుంచి మోడీ (Modi Tour) సిల్వాస్సాకు ప్రయాణిస్తారు. సూరత్ మీదుగా దాదాపు 1570 కిలోమీటర్లు సాగుతుంది. అక్కడ నమో మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. వివిధ ప్రాజెక్టులకు అంకితం చేసి శంకుస్థాపన చేస్తారని పీఎంవో తెలిపింది.

Also Read : Japan PM: జపాన్ ప్రధానిపై దాడి … తొమ్మిది నెలల క్రితమే ప్రధాని హత్య

ఇంకా, సముద్ర తీరం ప్రారంభోత్సవం కోసం డామన్‌కు వెళతారు. అక్క‌డ నుంచి ఆయన సూరత్‌కు వెళతారు. దాదాపు 110 కిలోమీటర్లు కవర్ చేస్తారు. సూరత్ నుంచి తిరిగి 940 కిమీ ప్ర‌యాణించ‌డం ద్వారా ఢిల్లీకి చేరుకుంటారు. ఆ మేరకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ(Modi Tour) షెడ్యూల్ ను అధికారికంగా పీఎంవో వెల్ల‌డించింది. ఈ బిజీ షెడ్యూల్‌లో ప్రధాని దాదాపు 5,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా బ్లూ ప్రింట్ ఉంది. బ‌హుశా గ‌తంలో ఎవ‌రూ ఇంత‌టి బిజీ షెడ్యూల్ ను క‌లిగిలేరని పీఎంవో భావిస్తోంది.వ‌యో భారం మీద ప‌డుతున్న‌ప్ప‌టికీ మోడీ చుర‌కైన నేత‌గా క‌నిపిస్తారు. ఎక్క‌డా అల‌స‌ట లేకుండా ప్ర‌సంగిస్తారు. దైనందిన కార్య‌క్ర‌మాలు బిజీగా ఉన్న‌ప్ప‌టికీ చలాకీగా ఉంటారు. అదే ఆయ‌న‌కు ప్ల‌స్ పాయింట్‌.

Also Read : BJP Mission ‘South India’: బీజేపీ ‘మిషన్ సౌత్ ఇండియా’: టార్గెట్‌ 130 సీట్లు