Site icon HashtagU Telugu

Rahul Gandhi : ప్రభుత్వ విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు..? బిజెపి ఎంపీనా..? లేక మోడీనా..?: రాహుల్ గాంధీ

Modi should give clarity on Kangana Ranaut comment: Rahul Gandhi

Modi should give clarity on Kangana Ranaut comment: Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ మాట్లాడుతూ.. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ మళ్లీ క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని అన్నారు. సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలని ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై మోడీ క్లారిటీ ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

Read Also: Hydra: ‘హైడ్రా’ కారణంగా ఎవరూ ప్రశాంతంగా నిద్ర పోవడం లేదు: మల్లారెడ్డి

ప్రభుత్వ విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు..? బీజేపీ ఎంపీనా..? లేక మోడీనా..? అని ప్రశ్నించారు. 700 మందికి పైగా రైతులు, ముఖ్యంగా హర్యానా, పంజాబ్ రైతులు బలిదానాలు చేసినా బీజేపీ సంతృప్తి చెందలేదని విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ చేసే ఏ కుట్రలను విజయవంతం చేయడానికి ఇండియా కూటమి అనుమతించదని అన్నారు.

ఇక అంతకు ముందు జమ్ములో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. పిఓకే నుంచి వచ్చిన శరణార్థులకు మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని నెరవేరుస్తామని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బయట వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే జమ్మూ కాశ్మీర్ నుంచి రాష్ట్ర హోదాను లాక్కున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందే హోదా కల్పించాల్సి ఉన్నా కేంద్రం విస్మరించిందని ఆరోపించారు. పార్లమెంట్‌లో కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం పోరాడతామని తెలిపారు రాహుల్ గాంధీ. నరేంద్ర మోడీ సర్కార్‌ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించకపోతే… భవిష్యత్‌లో ఇండి కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు.

Read Also: Mahadhan : అసిస్టెంట్ డైరెక్టర్ అవతారమెత్తబోతున్న రవితేజ కొడుకు..