Site icon HashtagU Telugu

Rajiv Gandhi: రాజీవ్ గాంధీ 79వ జయంతి: నివాళులు అర్పించిన మోడీ, రాహుల్, సోనియా

Rajiv Gandhi

New Web Story Copy (48)

Rajiv Gandhi: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆయనకు నివాళులర్పించారు. అంతకుముందు ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన సమాధి వీర్ భూమి వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.

లద్దాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ బాగా ఇష్టపడే పాంగాంగ్‌ లేక్‌ తీరంలో రాజీవ్ గాంధీ ఫొటో పెట్టి పూల మాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా తండ్రితో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు.

https://twitter.com/kharge/status/1693134820199555467/photo/1

Also Read: Ladakh: లడఖ్‌లో ప్రమాదానికి గురైన ఆర్మీ వాహనం: 9 మంది మృతి