Modi Busy : త‌ల్లి అంత్య‌క్రియ‌లు ముగిసిన మ‌రుక్ష‌ణం అధికారిక‌ కార్య‌క్ర‌మాల్లో మోడీ

ప్ర‌ధాన మంత్రి మోడీ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో(Modi Busy) బిజీ అయ్యారు.

  • Written By:
  • Updated On - December 30, 2022 / 04:33 PM IST

ప్ర‌ధాన మంత్రి మోడీ త‌ల్లి హీరాబెన్ అంత్య‌క్రియ‌లు ముగిసిన వెంట‌నే ప్ర‌భుత్వ అధికారిక కార్య‌క్ర‌మాల్లో(Modi Busy) బిజీ అయ్యారు. అంత్య‌క్రియ‌లు ( funeral ) ముగిసిన వెంట‌నే అహ్మదాబాద్ కు బయలుదేరి వెళ్లారు. అక్క‌డ నుంచి అధికారిక కార్యక్రమాల్లో (Modi Busy) పాల్గొన్నారు. తల్లి కన్నుమూసిన బాధను దిగమింగుకుంటూ వర్చువల్ విధానంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ లో 7,800 కోట్ల రూపాయల విలువ గల అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఇందులో వందేభారత్ ఎక్స్ ప్రెస్ కూడా ఉంది. షెడ్యూల్ ప్రకారం ఇవ్వాళ ఆయన పశ్చిమ బెంగాల్ లో పర్యటించాల్సి ఉంది.

మోడీ డైలీ షెడ్యూల్ లో కొన్ని మార్పులు (Modi busy)

తల్లి హీరాబెన్ కన్నుమూతతో మోడీ డైలీ షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ పర్యటన రద్దయింది. అయినప్పటికీ- వర్చువల్ గా అక్కడి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హౌరా-కోల్ కత వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ఆయన ప్రారంభించనున్నారు. నమామి గంగె మిషన్ సమీక్ష సమావేశానికి హాజరు కానున్నారు. వందేభారత్ సీరిస్ లో ఇప్పుడాయన చేపట్టబోయేది ఏడవది. కోల్ కత-హౌరా మధ్య పరుగులు తీయనుందీ ఎక్స్ ప్రెస్.

Also Read : Modi Mother : మోడీ త‌ల్లి హీరాబెన్ కు ఆస్తుల్లేవ్‌, ఆభ‌ర‌ణాల్లేవ్‌.!

హీరాబెన్ మృతి పట్ల దేశవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి తమ సంతాపం తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గె, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, అన్ని పార్టీల నాయకులు మోదీకి సంతాపం తెలుపుతూ ట్వీట్లు పోస్ట్ చేశారు.

నివాళి అనంతరం అంత్యక్రియ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అర్ధరాత్రి కన్నుమూశారు. ఆమె వయస్సు 100 సంవత్సరాలు. శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఆమె ఇటీవలే అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో అడ్మిట్ అయ్యారు. చికిత్స తీసుకుంటోన్న సమయంలో ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ- ఆ తరువాత విషమించింది. డాక్టర్లు అత్యాధునిక వైద్య చికిత్సను అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.

తల్లి మరణవార్త తెలిసిన వెంటనే మోదీ గాంధీనగర్ కు చేరుకున్నారు. ఆసుపత్రి నుంచి పార్థివ దేహాన్ని గాంధీనగర్ లోని రైసాన్ నివాసానికి తరలించారు. నివాళి అర్పించిన అనంతరం అంత్యక్రియలను చేపట్టారు. స్వయంగా తల్లి పాడెను మోశారు మోదీ. గాంధీనగర్ లోని శ్మశానవాటికలో చితికి(funeral) నిప్పంటించారు. మోదీ సోదరుడు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ, కేబినెట్ మంత్రులు, అతి కొద్దిమంది సన్నిహితులు హీరాబెన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Also Read : PM Modi: తల్లి పాడే మోసిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

అంత్య‌క్రియ‌లు ముగిసిన వెంట‌నే అహ్మ‌దాబాద్ చేరుకున్న మోడీ అధికారిక కార్య‌క్ర‌మాల్లో నిమ‌గ్నం అయ్యారు. సాధార‌ణంగా ఎవ‌రైనా త‌ల్లి మ‌ర‌ణించిన త‌రువాత వివిధ కార్య‌క్ర‌మాల్లో ఉంటారు. అందుకు భిన్నంగా మోడీ మాత్రం బాధ‌ను దిగ‌మింగుకుని ప్ర‌ధాని హోదాలో విధుల‌ను నిర్వ‌ర్తించారు. అధికారులు కూడా ఆయ‌న సూచ‌న మేర‌కు ప్ర‌తి రోజూ షెడ్యూల్ మాదిరిగానే కార్య‌క్ర‌మాల‌ను రూపొందించారు.

ప్రధాని మోదీ వర్చువల్ గా కోల్ కతా నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడిన మాటలు ప్రధానిని కదిలించాయి. ‘‘పశ్చిమబెంగాల్ ప్రజల తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. మీకు ఎంతో విషాదకరమైన రోజు నేడు. మీ అమ్మ మాకు కూడా అమ్మే. మీ సేవలు కొనసాగించేందుకు వీలుగా భగవంతుడు మీకు బలాన్ని ఇవ్వాలి. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి.

మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా సానుభూతి వ్యక్తం చేయాలో నాకు తెలియడం లేదు. మీకు ఈ రోజు ఎంతో విచారకరమైనది. అయినప్పటికీ, ఈ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరు కావడం అదొక గౌరవం. మీరు మీ పని ద్వారా మీ అమ్మగారి పట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.