Modi Oath Taking Ceremony: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రమాణస్వీకారోత్సవానికి ముందు, కొత్త ప్రభుత్వంలో మంత్రి మండలిలో భాగం కాబోతున్న ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంభాషించారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన మంత్రులతో మోడీ మాట్లాడారు. అటు సీనియర్ బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ప్రధానితో, మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మోడీ 3.0లో తిరిగి వచ్చే కేంద్ర మంత్రులలో ఎస్ జైశంకర్, నితిన్ గడ్కరీ, అమిత్ షా , రాజ్‌నాథ్ సింగ్ , నిర్మలా సీతారామన్ , పీయూష్ గోయల్ మరియు ధర్మేంద్ర ప్రధాన్ తదితరులుమళ్లీ కేబినెట్‌లో భాగమవ్వనున్నారు. కాగా ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా , మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ మరియు ఇతరులతోసహా భారతదేశం పొరుగు ప్రాంతం మరియు హిందూ మహాసముద్ర ప్రాంతం నుండి అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారానికి హాజరుకానుండగా, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా హాజరు కావడం లేదని తెలిపింది.
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎన్నికల రికార్డుతో సరిసమానంగా, మోదీ మూడోసారి రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వేదిక వద్ద ఐదు కంపెనీల పారామిలటరీ సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు మరియు స్నిపర్‌లతో బహుళస్థాయి భద్రతను మోహరిస్తారు.
Also Read: Delhi Water Crisis: 2 రోజుల్లో ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం: అతిషి