Site icon HashtagU Telugu

Congress : రాజ్యాంగాన్ని మార్చాలన యోచనలో మోడీ: రాహుల్‌ గాంధీ

Modi is planning to change the constitution: Rahul Gandhi

Rahul Gandhi: మే 20న ఐదో దశ ఎన్నికల్లో భాగంగా అమేథీ (Amethi)లో పోలింగ్‌ జరుగనుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ యూపీలోని అమేథీలో ఈరోజు కాంగ్రెస్‌ అభ్యర్థి శర్మకు మద్దతుగా ఏర్పాటైనా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) రాజ్యాంగాన్ని మార్చేందుకు పూనుకున్నార‌ని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాక.. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని రాహుల్ చెప్పారు. ప్రస్తుత రాజ్యాంగానికి ముగింపు పలకాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని… రాజ్యాంగం కనుమరుగైతే ప్రభుత్వ రంగమే ఉండదని అన్నారు. రిజర్వేషన్లకు స్వస్తి పలుకుతారని, ద్రవ్యోల్బణం తార స్థాయికి చేరుకుంటుందని చెప్పారు. ప్రజల హక్కులను ఒక్కొక్కటిగా లాక్కుంటారని తెలిపారు. 22 నుంచి 25 మంది శ్రీమంతుల కోసం రైతులు, కార్మికుల హక్కులను కాలరాస్తారని చెప్పారు. ఇప్పటి వరకు రైతులకు, ప్రజలకు మేలు జరిగినా… హరిత విప్లవాన్ని తీసుకొచ్చినా అది రాజ్యాంగంతోనే సాధ్యమయిందని అన్నారు.

Read Also: Somireddy Chandramohan Reddy : 135 ఎమ్మెల్యే సీట్లతో ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం

మరోవైపు అమేథీలో ఆయన ప్రసంగిస్తూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను గుర్తు చేసుకున్నారు. 42 ఏళ్ల క్రితం తన తండ్రి రాజీవ్ గాంధీతో కలిసి తొలిసారి తాను అమేథీకి వచ్చానని చెప్పారు. రాజకీయాల గురించి తాను ఏది నేర్చుకున్నా అది అమేథీ నుంచేనని… అమేథీ ప్రజలే తనకు అన్నీ నేర్పారని అన్నారు. తన తండ్రికి, అమేథీ ప్రజలకు ఉన్న ప్రేమానుబంధానికి తానే సాక్షినని చెప్పారు.

Read Also: Siddhu Jonnalagadda : టిల్లు బోయ్ తో సినిమా.. రెమ్యూనరేషన్ అంత ఇవ్వాల్సిందేనా..?

కాగా, తాను రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ… అమేథీతో తన బంధం చెక్కు చెదరదని రాహుల్ తెలిపారు. ఎప్పటికీ అమేథీ ప్రజల వెన్నంటే ఉంటానని చెప్పారు. తొలిసారి తాను అమేథీకి వచ్చినప్పుడు రోడ్లు కానీ, అభివృద్ధి కానీ లేదని తెలిపారు. ఈ లోక్ సభ ఎన్నికలు దేశానికి అత్యంత ముఖ్యమని చెప్పారు. ఒక జాతీయ పార్టీ (బీజేపీ) నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారని… రాజ్యాంగాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు.