PM Surya Ghar – Muft Bijli Yojana : గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 02:57 PM IST

పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో దేశ ప్రజలకు ప్రధాని మోడీ (PM Modi) గుడ్ న్యూస్ తెలిపారు. సౌర విద్యుత్తు, స్థిరమైన పురోగతిని పెంచే ప్రయత్నంలో, తమ ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన'(PM Surya Ghar – Muft Bijli Yojana)ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ప్రాజెక్ట్ పై ప్రభుత్వం ఋ. 75 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుందని ప్రధాని మోడీ వివరించారు. ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా అందజేసే సబ్‌స్టాంటివ్ సబ్సిడీల నుంచి భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల వరకు ప్రజలపై ఎలాంటి భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని తెలిపారు. దీని ద్వారా కోటి గృహాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. వాటాదారులందరూ జాతీయ ఆన్‌లైన్ పోర్టల్‌తో ఏకీకృతం చేయబడతారని క్లారిటీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా ఆదాయంతో పాటు తక్కువ విద్యుత్ బిల్లులు, ప్రజలకు ఉపాధి కల్పనకు దారి తీస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు.

Read Also : Ashok Chavan: కాషాయ కండువా కప్పుకున్న మాజీ సీఎం అశోక్ చ‌వాన్‌

Follow us