Site icon HashtagU Telugu

Modi Cabinet : మంత్రులకు శాఖలు కేటాయించిన మోడీ

Cabinet Ministers Shakha

Cabinet Ministers Shakha

కేంద్రంలో మరోసారి బిజెపి (BJP) అధికారంలోకి వచ్చింది. నిన్న రాష్ట్రపతి భవన్ లో ప్రధానిగా మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేయగా..72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇక తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో చేరినవారిలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), హెచ్‌డీ కుమారస్వామి (కర్ణాటక) ఉన్నారు. కొత్తగా కేబినెట్​లో చేరిన వారిలో బీజేపీ మిత్రపక్షాలకు చెందిన ఏడుగురు నేతలు ఉన్నారు.

తెలంగాణ నుంచి బండి సంజయ్​ కుమార్​ ఉండగా, ఆంధ్రప్రదేశ్​లో బీజేపీ నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ, టీడీపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్​ పెమ్మసాని తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో చేరారు. రాష్ట్రాల వారీగా చూస్తే కేంద్ర కేబినెట్​లో ఉత్తర్​ప్రదేశ్, బిహార్, మహారాష్ట్రకు మోడీ సర్కార్ పెద్ద పీట వేసింది. 80 లోక్​సభ స్థానాలున్న యూపీకి 9, బిహార్​కు 8 కేంద్ర కేబినెట్ బెర్తులు దక్కాయి. మహారాష్ట్రకు 6, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్​కు చెరో 5 కేంద్ర మంత్రి పదవులు వరించాయి. హరియాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెరో మూడు, ఒడిశా, అసోం, ఝార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, బంగాల్, కేరళకు చెరో రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.

ఇక నేడు తొలి మంత్రివర్గ భేటీ (First Cabinet meeting) ప్రారంభమైంది. 7 లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని మోడీ నివాసంలో మంత్రివర్గ భేటీ జరుగుతోంది. మంత్రివర్గ భేటీ తర్వాత మంత్రులకు శాఖల కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కేంద్ర హోంశాఖను మరోసారి అమిత్ షాకే ఇవ్వగా.. రక్షణ శాఖను మళ్లీ రాజ్ నాథ్ సింగ్‌కే కేటాయించినట్లు తెలుస్తుంది. అలాగే గత ప్రభుత్వంలో రోడ్డు రవాణా మంత్రిగా పని చేసిన నితీన్ గడ్కరీకే మరోసారి ఆ శాఖను కేటాయించారు.

We’re now on WhatsApp. Click to Join.

మిగతా శాఖల వివరాలు (Departments to ministers) చూస్తే..

నితిన్ గడ్కరీ- రోడ్డు రవాణా శాఖ
అమిత్ షా-హెం శాఖ
విదేశాంగ మంత్రి-జై శంకర్
రాజ్ నాథ్ సింగ్-రక్షణ
నిర్మలాసీతారామన్-ఆర్థిక శాఖ
మనోహర్ లాల్ ఖట్టర్-పట్టణ అభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ
హర్దీప్ సింగ్ పూరి-పెట్రోలియం
అశ్విని వైష్ణవ్-రైల్వే, సమాచార&ప్రసార
పీయూష్ గోయల్-వాణిజ్యం
ధర్మేంద్ర ప్రధాన్-విద్యా శాఖ
శ్రీపాద నాయక్-విద్యుత్
జేపీ నడ్డా-వైద్య శాఖ
రామ్మోహన్ నాయుడు-పౌర విమానయాన శాఖ
బూపేంద్ర యాదవ్-పర్యావరణ
కిరణ్ రిజుజు-పార్లమెంటరీ వ్యవహరాల శాఖ
శివరాజ్ సింగ్ చౌహాన్-వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ
గజేంద్రసింగ్ షెకావత్-టూరిజం
సీఆర్ పాటిల్-జలశక్తి
మన్సుఖ్ మాండవీయా-కార్మిక శాఖ, క్రీడలు
షిప్పింగ్-శర్బానంద సోనోవాల్
చిరాగ్ పాశ్వాన్-క్రీడలు
రన్వీత్ సింగ్ బిట్టూ-మైనార్టీ శాఖ
అన్నపూర్ణాదేవి-మహిళా శిశు సంక్షేమం
కుమార స్వామి- భారీ ఉక్కు పరిశ్రమలు
జ్యోతిరాదిత్య సిందియా-టెలికాం
ప్రహ్లాద్ జోషి-ఆహారం వినియోగదారుల సేవలు
సీఆర్ పాటిల్-జలశక్తి
కిషన్ రెడ్డి-బొగ్గు గనుల శాఖ మంత్రి
బండి సంజయ్-హోంశాఖ సహాయ మంత్రి
శ్రీనివాస వర్మ- ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
పెమ్మసాని చంద్రశేఖర్-గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి
రవాణా శాఖ సహాయ మంత్రులు- అజయ్ టమ్టా, హర్ష్‌ మల్హోత్రా.

1minster

1minster2

1minster3

1minster4

1minster5

Read Also : Kalki 2898 AD Trailer : ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ వచ్చేసింది..