Bangladesh Hindus : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న అంశంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) స్పందించింది. అక్కడి హిందువులకు సహాయం అందించేందుకు అంతర్జాతీయ మద్దతును కూడగట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ కోరింది.బంగ్లాదేశ్ హిందువులపై దాడులను ఆపేందుకు అందుబాటులో ఉన్న ప్రతీ మార్గాన్ని వాడుకోవాలని సూచించింది.
Also Read :Rythu Panduga Sabha : రైతుల కోసం రూ.54వేల కోట్లు ఖర్చు చేశాం.. ఎంతైనా ఖర్చు చేస్తాం : సీఎం రేవంత్
ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వం అరాచకానికి తెరతీసిందని మండిపడింది. హిందూ సంఘం(Bangladesh Hindus) నేత చిన్మయ్ కృష్ణదాస్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆర్ఎస్ఎస్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన్ను వెంటనే జైలు నుంచి రిలీజ్ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హిందువులపై దాడులు జరుగుతున్నా బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనుస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆర్ఎస్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read :Spa Center : స్పా సెంటర్‌లో క్రాస్ మసాజింగ్.. పెద్దసంఖ్యలో కండోమ్స్, గంజాయి
బంగ్లాదేశ్ హిందువులు ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్నా అణచివేయడం అనేది సరికాదని పేర్కొంది. బంగ్లాదేశ్ ప్రభుత్వమే చట్టవ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించింది. మరోవైపు ఇస్కాన్ సంస్థ డిసెంబరు 1న ప్రపంచవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు రెడీ అయింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. వారికి మద్దతుగా ఇస్కాన్ సభ్యులు రోడ్లపైకి వచ్చి ఆదివారం రోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
Also Read : Maharashtra New CM : డిసెంబరు 5న కొలువుతీరనున్న ‘మహాయుతి’ సర్కారు.. సీఎంగా ఆయనకే ఛాన్స్!
భారత్ వైఖరిని తప్పుపడుతున్న బంగ్లాదేశ్
ఇక మైనారిటీలకు భద్రత కల్పించే విషయంలో భారత ప్రభుత్వ వైఖరిని బంగ్లాదేశ్ తప్పుపడుతోంది. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని అంటోంది. భారత్‌లో మైనారిటీలుగా ఉన్న ముస్లింలపై దాడులు జరుగుతున్న విషయాన్ని బంగ్లాదేశ్ సర్కారు గుర్తు చేస్తోంది. ఈ ఘటనల పట్ల భారత ప్రభుత్వం ఎన్నడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని అంటోంది. ఇలాంటి ద్వంద్వ వైఖరిని వదిలివేయాలని భారత్‌కు బంగ్లాదేశ్ సూచిస్తోంది. ఈమేరకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వపు న్యాయ వ్యవహారాల సలహాదారు అసిఫ్ నజ్రుల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.