Mobile Tower Stolen: బీహార్‌లో సెల్ టవర్‌ చోరీ.. పట్టపగలే దొంగతనం.. చోరీ ఎలా చేశారో తెలుసా..?

బీహార్‌ (Bihar)లో రైలు ఇంజిన్, రైల్వే ట్రాక్ చోరీ తర్వాత, ఇప్పుడు మొబైల్ టవర్ చోరీ (Mobile Tower Stolen) ఘటన ముజఫర్‌పూర్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రమజీవి నగర్‌లో వెలుగులోకి వచ్చింది.

  • Written By:
  • Publish Date - April 16, 2023 / 08:55 AM IST

బీహార్‌ (Bihar)లో రైలు ఇంజిన్, రైల్వే ట్రాక్ చోరీ తర్వాత, ఇప్పుడు మొబైల్ టవర్ చోరీ (Mobile Tower Stolen) ఘటన ముజఫర్‌పూర్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రమజీవి నగర్‌లో వెలుగులోకి వచ్చింది. టవర్ కంపెనీ అధికారి షానవాజ్ అన్వర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. టవర్‌కు అనుబంధంగా ఉన్న అనేక పరికరాలు కూడా చోరీకి గురైనట్లు చెబుతున్నారు. సమాచారం ప్రకారం.. జీటీఏఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ శ్రమజీవి నగర్‌కు చెందిన మనీషా కుమారి నివాస సముదాయంలో మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేసింది. ఈ టవర్ ఇన్‌స్పెక్షన్ కోసం ఇటీవలే అధికారులు మనీషా కుమారి ఇంటికి చేరి టవర్ లేకపోవడంతో షాక్ అయ్యారు. అక్కడ వారు ఏర్పాటు చేసిన టవర్ కనిపించలేదు. .

కంపెనీ ఉద్యోగి తనిఖీ నిమిత్తం అక్కడికి చేరుకుని చూడగా టవర్‌ కనిపించలేదు. ఇది కాకుండా షెల్టర్, డీజిల్ జనరేటర్, SMPF, స్టెబిలైజర్‌తో సహా అనేక వస్తువులు కూడా స్పాట్‌లో కనిపించలేదు. దీని ధర దాదాపు నాలుగున్నర లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. టవర్ చోరీపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!

కొన్ని నెలల క్రితం కొందరు వచ్చి తమను జీటీఎల్‌ కంపెనీ ఉద్యోగులమని చెప్పుకున్నారని విచారణలో మనీషా కుమారి పోలీసులకు తెలిపారు. ఆ టవర్ పని చేయడం లేదని, దాన్ని తొలగిస్తున్నట్టు తమకు చెప్పారని వివరించింది. ఆ టవర్‌ను పట్టపగలు నాలుగు గంటలు పని చేసి విడి భాగాలుగా విప్పారని పేర్కొంది. వెంట తెచ్చుకున్న ట్రక్కులో వాటిని లోడ్ చేసుకున్నారు.

బీహార్‌లో మొబైల్ టవర్ చోరీకి పాల్పడడం ఇదే తొలిసారి కాదు. 2022లో రాజధాని పాట్నాలో టవర్ చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనలోనూ దొంగలు తమను తాము కంపెనీ ఉద్యోగులమని చెప్పి 72 గంటల్లో టవర్‌ను ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్‌తో మొబైల్ టవర్‌ను కత్తిరించేందుకు 25 మంది మూడు రాత్రులు శ్రమించారు. ఆపై ముక్కలన్నింటినీ ఒక ట్రక్కులో నింపి పారిపోయారు.