Navneet Rana : బీజేపీ నేత నవనీత్‌ రాణాపై కుర్చీలతో దాడి.. ఏమైందంటే..

ఖల్లార్ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నవనీత్ రాణా(Navneet Rana) ప్రసంగించారు. 

Published By: HashtagU Telugu Desk
Mob Attack On Bjp Mp Navneet Ranas Rally In Amravati Maharashtra

Navneet Rana : అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ రాణా‌పై దాడికి కొందరు వ్యక్తులు యత్నించారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా దరియాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఖల్లార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఖల్లార్ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నవనీత్ రాణా(Navneet Rana) ప్రసంగించారు.  ఆమె ప్రసంగం ముగించి వేదికపై నుంచి కిందికి దిగి రాగానే.. ఆమెపైకి కొందరు కుర్చీలు విసిరేందుకు యత్నించారు. దీనిపై ఖల్లార్ పోలీస్ స్టేషన్‌లో నవనీత్ రాణా‌ ఫిర్యాదు చేశారు.

Also Read :Shocking Incident : నిండు గర్భిణిని 25 ముక్కలుగా నరికి కెనాల్‌లో వేశారు

ఈ ఘటన గురించి మీడియాకు నవనీత్ రాణా వివరించారు. ‘‘నేను ఖల్లార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించాను. నేను ప్రసంగిస్తుండగా కొందరు అసభ్యంగా కేకలు వేశారు. దీంతో నేను స్టేజీ దిగి.. అలా అరవొద్దని వారిని వారించాను. అయినా వాళ్లు ఊరుకోకుండా నా కులాన్ని ప్రస్తావిస్తూ దూషించారు. కొందరు నాపై ఉమ్మివేశారు. నాపైకి కుర్చీలు విసిరారు. నా సెక్యూరిటీ గార్డులను కొట్టారు. ఈక్రమంలో నా బాడీగార్డులు సాహసోపేతంగా వ్యవహరించి నన్ను కాపాడారు. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు’’ అని నవనీత్ రాణా చెప్పారు. నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేయకపోతే.. మొత్తం అమరావతి జిల్లా హిందూ సమాజం ఖల్లార్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన తెలపాల్సి ఉంటుందని ఆమె వార్నింగ్ ఇచ్చారు.

Also Read :Cow Dung : ఆవుపేడలో రూ.20 లక్షలు.. దొరికిపోయిన చోరీ సొత్తు

దరియాపూర్ అసెంబ్లీ స్థానంలో యువ స్వాభిమాన్ పార్టీ అభ్యర్థి రమేష్ బండిలే తరఫున నవనీత్ రాణా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీడియో ఫుటేజీ ప్రకారం.. ఆ సభా స్థలంలో ఉన్న కొందరిని అక్కడి నుంచి వెళ్లిపొమ్మంటూ వేలు చూపించి నవనీత్ రాణా హెచ్చరించారు. అంతేకాదు వారి వైపుగా ఆమె నడుచుకుంటూ  వెళ్లారు. ఈక్రమంలో ఆమెపైకి పలువురు వ్యక్తులు కుర్చీలు విసరడం మొదలుపెట్టారు.

Also Read :Bomb Prank : యూట్యూబ్‌‌ చూసి బాంబు తయారుచేసి.. టీచర్ కుర్చీ కింద పేల్చారు

  Last Updated: 17 Nov 2024, 01:00 PM IST